• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లుక్ టెస్ట్ - ఆడిష‌న్...

లుక్ టెస్ట్ - ఆడిష‌న్ లేకుండానే ఛాన్సిచ్చారు- రేణు దేశాయ్

| చాలా కాలం తర్వాత ‘O.M: ఆపరేషన్ మోల్’తో రేణు దేశాయ్ నటనలోకి తిరిగి వస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కుమార్తె ఆద్యతో కలిసి పాల్గొన్న ఆమె.. ధనుష్, మమ్ముట్టి, శ్రీలీలతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభవమని భావోద్వేగానికి గురయ్యారు. మహాశివరాత్రి రోజున ఈ సినిమా అవకాశం రావడం దేవుడి ఆశీస్సుగా భావిస్తున్నానని తెలిపారు. చిత్రం నవంబర్ 20న విడుదల కానుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-17 06:51 GMT

రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తిరిగి న‌ట‌న‌లోకి వ‌స్తున్నారు. ధ‌నుష్‌, మ‌మ్ముట్టి లాంటి దిగ్గ‌జాలు న‌టించిన `ఓం`(O.M) అనే చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. త‌న‌కు ఈ అవ‌కాశం రావ‌డంపై రేణు దేశాయ్ ఆశ్చ‌ర్యంతో కూడుకున్న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా నిర్వ‌హించ‌గా.. ఈ కార్యక్రమంలో తన కుమార్తె ఆద్యతో కలిసి సందడి చేసిన రేణు దేశాయ్ వేదిక‌పై భావోద్వేగ ప్రసంగంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఈ వేడుకలో మాట్లాడుతూ.. సెట్లో అనుభవాలను, సహనటులతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.

ఈ ప్రాజెక్ట్ లో అవ‌కాశం ఎలా వ‌చ్చిందో రేణు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినాన తాను కామాఖ్య ఆలయంలో ఉన్న సమయంలో నిర్మాత‌ల నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. `ఓం` అనే టైటిల్, మహాశివుడు - కామాఖ్య దేవి ఆశీస్సులతో ఈ అవకాశం రావడం తన జీవితంలో ఒక గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నానని పేర్కొన్నారు.

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియ‌స్వామి ఈ వేదిక‌కు హాజ‌రు కాలేక‌పోయార‌ని తెలిపిన రేణు అత‌డి ప్ర‌తిభ‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. తనకు ఎలాంటి ముందస్తు మీటింగులు లేవు.. లుక్ టెస్ట్ లేదా ఆడిషన్ కూడా చేయకుండా ఏ నమ్మకంతో ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలని నవ్వుతూ అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా తన వంతు ప్రయత్నం చేశానని.. ఈ సినిమాలో ఎలా న‌టించానో థియేటర్లలో చూసి ప్రేక్ష‌కులే చెప్పాలని కోరారు.

`ఓమ్‌` సినిమాలో త‌న స‌హ‌న‌టీన‌టుల గురించి రేణు దేశాయ్ భావోద్వేగంతో మాట్లాడారు. ముఖ్యంగా శ్రీలీలతో కలిసి పనిచేసిన సన్నివేశాలను ఎంతగానో ఎంజాయ్ చేశానని చెప్పారు. అలాగే తమిళంలో మాట్లాడేటప్పుడు కొన్ని చిన్నచిన్న తప్పులు దొర్లినా ఎంతో సహనంతో భరించిన హీరో ధనుష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో మరువలేని అనుభవమని రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటన గురించో.. వ్యక్తిత్వం గురించో చెప్పడానికి తన స్థాయి సరిపోదని.. లెజెండ‌రీ న‌టుడితో క‌లిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని కొనియాడారు. నేను ఎలా న‌టించానో తెలీదు.. థియేట‌ర్ల‌లో చూసి మీరే చెప్పండి! ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించండి అని రేణు దేశాయ్ కోరారు.

ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా, మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో `అమరన్` ఫేమ్ రాజ్‌కుమార్ పెరియ‌సామి దర్శకత్వంలో తెరకెక్కిన‌ భారీ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `O.M: ఆపరేషన్ మోల్` ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తిరుపతి - తిరువన్నమలై అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ -గూఢచర్య ఆపరేషన్ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రాన్స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Tags:    
  • renudesai 
  • omoperationmole 
  • dhanush 
  • mammootty 
  • sreeleela 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS