• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో ఆరేళ్ల...

స్టార్ హీరో ఆరేళ్ల రికార్డును.. ఏడాదికే దాటేసిన ఫోక్ సాంగ్..!

| తెలంగాణ ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాదిలోపే 95.7 కోట్ల వ్యూస్ సాధించి, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’లోని ‘బుట్ట బొమ్మ’ ఆరేళ్లలో సాధించిన 95.5 కోట్ల వ్యూస్‌ను అధిగమించింది. రాము రాథోడ్, ప్రభా ఆలపించిన ఈ పాటను కేవలం రూ.5 లక్షల బడ్జెట్‌తో రూపొందించడం విశేషం.

By - Madhu Reddy
Update: 2026-11-17 10:03 GMT

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పై ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ జానపద కళను ప్రతిబింబించే ప్రైవేటు ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. పల్లెటూరి మట్టి వాసన, యాస , భాష అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ కి మరింత ఆదరణ పెరిగిపోయింది. యూట్యూబ్ కి పెరుగుతున్న ఆదరణ ఇటు ఫోక్ సాంగ్స్ ను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేస్తోంది. అలా యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న ఎన్నో ఫోక్ సాంగ్స్ అటు ఆదాయం పరంగానే కాకుండా ఇటు స్టార్ హీరోల పాటల రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్నాయి అంటే.. ఇక ఫోక్ సాంగ్స్ కి ప్రేక్షకులలో ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే ఒక ఫోక్ సాంగ్ ఏడాదిలోపే ఏకంగా స్టార్ హీరో ఆరేళ్ల రికార్డును బ్రేక్ చేసింది అంటే ఎవరైనా నమ్మగలరా? ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా అక్షర సత్యం అని చెప్పవచ్చు. మరి ఏంటా ఫోక్ సాంగ్? ఎవరా స్టార్ హీరో? అనే విషయానికి వస్తే.. తెలంగాణ ఫోక్ సెన్సేషనల్ సాంగ్ "రాను బొంబాయికి రాను" పాట ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో టాప్ సాంగ్ గా ఈ పాట రికార్డు నమోదు చేసింది. అంతేకాదు అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాట "బుట్ట బొమ్మ" రికార్డును కూడా ఈ సాంగ్ బ్రేక్ చేయడం గమనార్హం.

విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన 'అలవైకుంఠపురంలో' చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ అప్పట్లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్ దాదాపు ఆరేళ్లలో ఏకంగా 95.5 కోట్ల వ్యూస్ సాధించింది. అయితే 'రాథోడ్ ట్యూన్స్' అనే యూట్యూబ్ ఛానల్ లో విడుదలైన "రాను బొంబాయికి రాను" అనే ఫోక్ సాంగ్ కేవలం ఏడాదిలోపే ఏకంగా 95.7 కోట్ల వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక జానపద గీతం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సాంగ్ ను వెనక్కి నెట్టడం ఇదే తొలిసారి.

ఏది ఏమైనా ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ సాంగ్ రికార్డును బ్రేక్ చేయడం సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది.

రాను బొంబాయికి రాను సాంగ్ విషయానికి వస్తే.. ఈ పాటకు ప్రముఖ ఫోక్ సింగర్ రాము రాథోడ్ స్వయంగా సాహిత్యం అందించడంతోపాటు సింగర్ ప్రభా తో కలిసి అద్భుతంగా ఆలపించారు. కళ్యాణ్ కీస్ అందించిన మ్యూజిక్ , శేఖర్ వైరస్ మాస్టర్ సమకూర్చిన మాస్ డాన్స్ స్టెప్పులు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేవలం రూ.5 లక్షల బడ్జెట్ తో వేములవాడ, జగిత్యాల పరిసరాల ప్రాంతాల్లో ఈ పాటను రూపొందించారు. పైగా ఈ పాట సృష్టించిన సినిమాకి యూట్యూబ్ యాడ్స్, ట్రెండింగ్ ద్వారా క్రియేటర్లకు సుమారుగా కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు ఇటీవల ఒక టాక్ షోలో రాము రాథోడ్ స్వయంగా చెప్పడం గమనార్హం.



Full View


Tags:    
  • ramurathod 
  • telanganafolksong 
  • buttabomma 
  • alluarjun 
  • ranubombaikiranu 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS