• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త సమస్యలో చిక్కుకున్న...

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

| జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా వాయిదా పడలేదని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ‘డ్రాగన్’ విడుదలైన తర్వాత వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా మేలో మొదలై సంక్రాంతి 2028కి విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ రెండు సినిమాల షూటింగ్‌లను ఎలా సర్దుబాటు చేస్తారనే ఆసక్తి నెలకొంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-17 10:20 GMT

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయాల్సి ఉంది. 'గాడ్ ఆఫ్ వార్' అనే పేరుతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. ఎన్టీఆర్ కొత్త సినిమాల లైనప్ కారణంగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ విషయంలో కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నారనే ఈ మధ్యనే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి 2028 విడుదల లక్ష్యంగా రూపొందే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అందుకోసం అనిల్ రావిపూడి మే నెల నుంచే షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు త్రివిక్రమ్ సినిమాను కూడా జూలైలో మొదలుపెట్టాలని నిర్మాత నాగవంశీ సిద్ధమవుతున్నారు.

ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకేసారి నిర్వహించడం ఎన్టీఆర్‌కు సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్రాగన్ కు సంబంధించిన కొన్ని పెండింగ్ షూటింగ్ పనులు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎన్టీఆర్ తన కాల్షీట్లను ఎలా సర్దుబాటు చేస్తారనేది కీలకంగా మారింది.

ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో.. జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయింది అన్న వార్తలు కూడా వచ్చాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమా ఒప్పుకున్నారు అన్న వార్త బాగా వైరల్ అయింది. ఇక ఈ వార్తకు నిర్మాత నాగవంశం క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన 'ఓం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన నాగవంశీ, ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా వాయిదా పడలేదని వెల్లడించారు. 'డ్రాగన్' విడుదల తర్వాత జూలైలో తమ సినిమా పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో అన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో వేచి చూడాలి.

Tags:    
  • ntr 
  • trivikram 
  • anilravipudi 
  • godofwar 
  • dragonmovie 
  • nagavamsi 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS