• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా జీవితంలో క్లిష్టమైన...

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

| రెండో గర్భధారణ సమయంలో మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఉపాసన వెల్లడించారు. హైదరాబాద్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రారంభోత్సవంలో తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో బాధపడ్డానని తెలిపారు. ప్రసవం తర్వాత తల్లి కోలుకోవడానికి కుటుంబ సభ్యులు, భర్త, వైద్యుల మద్దతు ఎంతో అవసరమని, ఆమెకు ప్రేమతో అండగా నిలవాలని సూచించారు.

By - Madhu Reddy
Update: 2026-11-17 17:39 GMT

అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలుగా, మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఉపాసన. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈమె..తన కెరియర్లో ఎన్నో బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న ఉపాసన అటు వ్యాపార బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ.. మరొకవైపు తల్లిగా, భార్యగా, కోడలిగా కూడా కొనసాగుతోంది.

నిత్యం మహిళల ఆరోగ్యం, మాతృత్వం, పిల్లల సంరక్షణ గురించి ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఉపాసన.. తొలిసారి ఒక స్టేజిపై కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడూ ధైర్యంగా చిరునవ్వుతో కనిపించే ఉపాసనలో కూడా ఇంత బాధ ఉందా అంటూ మెగా అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి తన సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ప్రస్తావిస్తూ ఉపాసన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అపోలో హాస్పిటల్ లో తాజాగా "అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్" ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఉపాసన మహిళల ఆరోగ్యం, గర్భధారణ ప్రసవం తర్వాత ఎదురయ్యే సమస్యల గురించి ప్రస్తావించింది. అందులో భాగంగానే తన రెండవ ప్రెగ్నెన్సీ అనుభవాన్ని కూడా ఆమె పంచుకోవడం గమనార్హం. ఆ బాధను పంచుకుంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలిచి వేసింది.

ఉపాసన మాట్లాడుతూ.." నేను మొదటి సారి గర్భం దాల్చినప్పుడు చాలా సులభంగా ఆ ప్రయాణాన్ని ముగించాను. కానీ రెండవ ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో మానసిక వేదనను అనుభవించాను.కవల పిల్లలకు జన్మనివ్వడం అనేది నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అనుభవం అయినప్పటికీ.. ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

మొదటి డెలివరీ సమయంలో ఎదురుకాని ఎన్నో సమస్యలు రెండోసారి నన్ను మానసికంగా కృంగదీసాయి.పైకి సంతోషంగా కనిపిస్తున్నా.. నాలో ఇంకా ఎన్నో గాయాలు మాన్పుకుంటున్న తల్లి ఉంది. గర్భం దాల్చడం అంటే కేవలం 9 నెలల ప్రయాణం మాత్రమే కాదు గర్భం దాల్చడానికి ప్రయత్నించే సమయంలో కూడా మహిళలు ఎన్నో భావోద్వేగాలకు గురవుతారు. పీరియడ్స్ మిస్ అయితే సంతోషపడతారు. అదే పీరియడ్ వస్తే ఆందోళన, తీవ్ర నిరాశకు గురవుతారు.

సహజంగా గర్భం కోసం ప్రయత్నించినా.. ఫెర్టిలిటీ చికిత్స తీసుకున్నా సరే మహిళల ఆందోళన ఒకేలా ఉంటుంది. అలాగే ప్రసవం తరువాత ప్రతి మహిళ జీవితంలో కీలకమైన దశ అనే చెప్పాలి. ఆ సమయంలో తల్లికి భర్త, కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి పూర్తి సహకారం అవసరమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే గర్భం దాల్చింది మొదలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఆ తల్లి తనను తాను హీల్ చేసుకోవడానికి సమయం పడుతుంది. అలాంటి సమయంలో ఆమెకు అండగా నిలవండి. కావలసినంత సపోర్టు ఇవ్వండి.

ముఖ్యంగా లోపల జరిగే గాయాల తాలూకా బాధలు కంటే బయట నుంచి అందించే ప్రేమ ఆమెను త్వరగా రికవరీ చేయగలదు.అందుకే ప్రతి మహిళా కూడా తనకు వచ్చే ప్రతి సమస్యను కుటుంబ సభ్యులతో , వైద్యులతో కచ్చితంగా చెప్పుకోవాలి అంటూ తన అభిప్రాయంగా పంచుకొచ్చింది ఉపాసన. మొత్తానికైతే తన ప్రెగ్నెన్సీ సమయంలో అలాగే పోస్టు పార్టమ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపింది .

Tags:    
  • upasanakonidela 
  • postpartumdepression 
  • pregnancyjourney 

Similar News

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

Copyright @2026

Powered by Blink CMS