వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!
| జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ రాశి ఖన్నా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన జిమ్ కోచ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న ఈ బ్యూటీ.. ప్రతిరోజూ ప్రేరణ కోసం ఎదురుచూడకుండా కొన్ని రోజులు మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం పలు తెలుగు, తమిళ, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
సినిమా ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను సెలబ్రిటీలు కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా మేల్ ఆర్టిస్ట్ లతో పోల్చుకుంటే.. ఫిమేల్ ఆర్టిస్టులకు వయసుతో పాటు క్యారెక్టర్లు కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే హీరోయిన్గా తమను తాము మరింత ప్రూవ్ చేసుకోవడానికి సెలబ్రిటీలు నిత్యం కష్టపడుతూ ఉంటారు. తీసుకునే ఆహారం మొదలుకొని శరీర ఆకృతుల విషయంలో కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్ సెంటర్లలో వర్కౌట్స్ తో వీరు పడే కుస్తీ అంతా ఇంతా కాదు.
ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ గా అనిపిస్తూ.. గ్లామర్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. జిమ్ లో కష్టపడిపోతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అలా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గట్టిగా పడుతోంది రాశి ఖన్నా. తన జిమ్ కోచ్ ఆధ్వర్యంలో ఈమె చేస్తున్న వర్కౌట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోని ఆమె షేర్ చేస్తూ ప్రతిరోజు ప్రేరణ పొందడం కాదు కొన్ని రోజులు మిమ్మల్ని మీరే ముందుకు నడిపించుకోవాలి అప్పుడే సగం పని పూర్తయినట్లు అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికి అయితే కష్టపడనిదే ఏదీ రాదు అంటూ రాశి ఖన్నా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె.. ఈ సినిమా తర్వాత మనం సినిమాలో అతిథి పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలు ఒకే ఏడాది ఆడియన్స్ కి ముందుకు రావడం గమనార్హం. ఆ తర్వాత జోరు, జిల్ ,శివం ,బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవకుశ , రాజా ది గ్రేట్ , టచ్ చేసి చూడు, తొలిప్రేమ ఇలా ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో తనను తాను ప్రూవ్ చేసుకొని.. తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంది. కానీ వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం రాశి ఖన్నా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధర్మన్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది .అలాగే విక్రాంత్ మాస్సేతో కలసి తలాఖోన్ మే ఏక్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న ఈమె.. సిద్ధార్థ్ సరసన రౌడీ అండ్ కో అనే తమిళ చిత్రంలో కూడా భాగమైంది. అంతేకాదు అక్షయ్ కుమార్, విద్యాబాలన్ లతో కలసి అనీస్ బాజ్మీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న రాశి ఖన్నా మరికొన్ని సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.