• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Life Style >  టాప్ స్టోరి: న‌గ‌ర...

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

| బాలీవుడ్ స్టార్లు ముంబై శివార్లలో వందల ఎకరాల విలువైన ఫామ్‌హౌస్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్‌కు పన్వేల్‌లో 150 ఎకరాలు, షారుఖ్ ఖాన్‌కు అలీబాగ్‌లో 5 ఎకరాలు, అజయ్ దేవ్‌గన్‌కు కర్జత్‌లో 30.05 ఎకరాల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ముంబై-అటల్ సేతు, కొత్త విమానాశ్రయం కారణంగా ఈ ప్రాంతాల్లో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

By - Sivaji Kontham
Update: 2026-11-11 04:29 GMT

హిందీ తార‌ల విలాస‌వంత‌మైన జీవితాల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. విలాస‌వంత‌మైన‌ భ‌వ‌నాలు, కార్లు, వాచ్ లు, వేష‌ధార‌ణ‌ల కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తుంటారు. అంతేకాదు వారాంతంలో కుటుంబంతో ముంబై సిటీ ఔట‌ర్ లో విహార‌యాత్ర‌లు చేయ‌డానికి, విందు వినోదాల్లో మునిగి తేల‌డానికి సొంతంగా ఫామ్ హౌస్ లు నిర్మించుకున్న స్టార్లు ఉన్నారు. ముఖ్యంగా కర్జత్, పాన్వెల్, అలీబాగ్ వంటి రాయ్‌గఢ్ జిల్లా ప్రాంతాలలో తారలకు భారీ విస్తీర్ణంలో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. వీకెండ్‌లలో విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబ శుభకార్యాలు, ప్రైవేట్ విందులు ఏర్పాటు చేసుకోవడానికి ఎకరాల కొద్దీ భూములను వీరు కొనుగోలు చేశారు. కొన్నేళ్ల క్రిత‌మే వ్య‌వ‌సాయ భూముల‌ను కొనుగోలు చేయ‌గా, అవి ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీలుగా మారిపోతున్నాయి. వాటి ధ‌ర‌లు ఇప్పుడు వంద‌ల కోట్లుగా మారాయి.

వంద‌ల ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమిని కొనుగోలు చేసిన‌ ప్ర‌ముఖుల్లో ముందు వ‌రుస‌లో ఉంటాడు స‌ల్మాన్ భాయ్. అత‌డు ముంబై ఔట‌ర్ లో పాన్వెల్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో సుమారు 150 ఎకరాలు కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసాడు. `అర్పితా ఫామ్స్` అని దీనికి పేరు పెట్టుకున్నాడు. ఈ భూమి అంచనా విలువ రూ. 80 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ఉంటుంది. సల్మాన్ తన వీకెండ్స్‌తో పాటు లాక్‌డౌన్ సమయాన్ని కూడా ఇక్కడే గడిపారు. ఈ ఫామ్‌హౌస్‌లో ప్రైవేట్ జిమ్, స్విమ్మింగ్ పూల్, గుర్రపు శాలలు, లగ్జరీ రైడింగ్ ట్రాక్స్‌తో పాటు పెద్ద ఎత్తున ఆర్గానిక్ వ్యవసాయ భూములు కూడా అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అలీబాగ్‌లోని డెజోరి ప్రాంతంలో సుమారు 5 ఎకరాల (20,000 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఒక విలాసవంతమైన సీ-ఫేసింగ్ ఫామ్‌హౌస్‌ను నిర్మించాడు. రూ. 15 కోట్ల నుండి రూ. 20 కోట్ల విలువ చేసే ఈ ప్రాపర్టీలో ప్రైవేట్ హెలిప్యాడ్, రాయల్ లాంజ్, ఈత కొలను ఉన్నాయి. షారూఖ్ తన పుట్టినరోజు వేడుకలతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఘ‌న‌మైన‌ పార్టీలు ఇవ్వడానికి.. పండుగల సమయాల్లో కుటుంబంతో గడపడానికి ఈ అలీబాగ్ ఫామ్‌హౌస్‌నే వేదికగా ఉపయోగిస్తుంటారు.

యాక్షన్ హీరో అజయ్ దేవ్‌గన్ మొన్న‌టికి మొన్న రెండు ఎక‌రాల వ్య‌వ‌సాయ‌ భూమిని ఔట‌ర్ లోని క‌ర్జ‌త్ ఏరియాలో కొన్నారు. కర్జత్‌లో 28 ఎకరాల విశాలమైన ఫామ్‌హౌస్‌ను కొన్నేళ్ల క్రిత‌మే ఏర్పాటు చేసుకోగా తాజాగా 2.05 ఎకరాల అదనపు వ్యవసాయ భూమిని రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేయడంతో దీని మొత్తం విస్తీర్ణం 30.05 ఎకరాలకు చేరింది. రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల విలువైన ఈ ఫామ్‌హౌస్‌లో అజయ్ పెద్ద ఎత్తున సేంద్రీయ కూరగాయలు, మామిడి తోటలను సాగు చేస్తున్నారు.

ఇక సీనియర్ హీరో సన్నీ డియోల్ కూడా కర్జత్ , మనాలీ హిల్ స్టేష‌న్ ప్రాంతాల్లో రూ. 15 కోట్ల నుండి రూ. 20 కోట్ల విలువైన ప్రైవేట్ ఎస్టేట్లలో ప్రకృతి ఒడిలో సమయాన్ని గడుపుతుంటారు. అలాగే ముంబై ఔటర్ కాకుండా పటౌడీ రాజవంశానికి చెందిన సైఫ్ ఆలీ ఖాన్ హర్యానాలో రూ. 800 కోట్లకు పైగా విలువైన 10 ఎకరాల హెరిటేజ్ పటాడీ ప్యాలెస్‌ను కలిగి ఉన్నారు. ఆయ‌న కుటుంబం సెలవు దినాల‌లో ఇక్క‌డ ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఆస‌క్తిగా ఉంటుంది.

ముంబై నగర పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటం.. ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ దొరకడం అసాధ్యం కావడంతో తారలంతా ఔట‌ర్ లోని పాన్వెల్, కర్జత్, అలీబాగ్ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇటీవల ప్రారంభమైన `ముంబై-అటల్ సేతు` వంతెన.. నిర్మాణంలో ఉన్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కారణంగా సౌత్ ముంబై నుంచి ఈ ప్రాంతాలకు ప్రయాణ సమయం బాగా తగ్గిపోయింది. దాంతో ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూముల విలువలు ప్రస్తుతం వేగంగా పెరుగుతుండటంతో బాలీవుడ్ స్టార్ల ఫామ్‌హౌస్ ప్రాపర్టీల మార్కెట్ రేంజ్ రికార్డు స్థాయిలకు చేరుతోంది. హైద‌రాబాద్ ఔట‌ర్ లోను ప‌లువురు టాలీవుడ్ స్టార్లు భారీగా వ్య‌వ‌సాయ భూముల్ని కొనుగోలు చేయ‌గా అవి కూడా క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీలుగా మారుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • bollywoodstars 
  • salmankhan 
  • shahrukhkhan 
  • ajaydevgn 
  • sunnydeol 
  • saifalikhan 
  • luxuryfarmhouse 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

మనసులో చీకట్లు తొలగించుకో !

2026-11-08 06:44 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

నీళ్లకు బదులు చెర్రీ కోక్.. వారెన్ బఫెట్ డైట్ సీక్రెట్ ఇదేనా?

2026-11-01 04:34 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

చరిత్రలో అత్యంత ధనవంతులు వీళ్లేనా? మాన్సా మూసా నుంచి ఎలాన్ మస్క్ వరకు అసలు లెక్కలేంటి?

2026-10-23 09:30 GMT

బెంగళూరు, హైదరాబాద్‌లకు ప్రత్యామ్నాయంగా మరో నగరం దొరుకుతుందా?

2026-10-22 19:30 GMT

ఫ్రెండ్ తాగే సిగరెట్ మీ ప్రాణాలు తీస్తుంది బాస్

2026-10-04 03:42 GMT

Copyright @2026

Powered by Blink CMS