• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డేంజర్ జోన్‌లో సీనియర్...

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

| కాజల్ అగర్వాల్, తమన్నా, కీర్తి సురేష్ వంటి సీనియర్ హీరోయిన్లకు వరుస పరాజయాలతో అవకాశాలు తగ్గుతున్నాయనే చర్చ టాలీవుడ్, కోలీవుడ్‌లో సాగుతోంది. కొత్త హీరోయిన్లకు మేకర్స్ ప్రాధాన్యత ఇస్తుండటంతో వీరి కెరీర్ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అయితే నయనతార మాత్రం పరాజయాలు ఎదురైనా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-11 13:30 GMT

హీరోయిన్ల‌ కెరీర్ స్పాన్ త‌క్కువ‌గానే ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. హీరోల‌కు ఉన్నంత డిమాండ్ హీరోయిన్ల‌కు ఉండ‌దు. మేక‌ర్స్ కొత్త భామ‌ల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త సీనియ‌ర్ల‌కు ఇవ్వ‌రు. ఎంత‌టి అగ్ర నాయికలైనా వరుస విజయాలు ప‌డ‌క‌పోతే? ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు బాక్సాఫీస్‌ను ఏలిన కొందరు సీనియర్ స్టార్ హీరోయిన్ల కెరీర్ ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. కాజల్ అగర్వాల్, తమన్నా , కీర్తి సురేష్ వంటి భామ‌ల‌కు ఇటీవల ఆశించిన స్థాయిలో హిట్లు పడకపోవడంతో కెరీర్ డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఒకానొక దశలో దశాబ్దానికి పైగా నంబర్ వన్ స్థానంలో కొనసాగిన చందమామ కాజల్ అగర్వాల్ మాతృత్వపు విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చినా? ఆశించిన సక్సెస్ రాలేదు. కాజ‌ల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మేకర్స్ ఆమెను లీడ్ రోల్స్ కోసం సంప్రదించడానికి వెనుకడుగు వేస్తున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ కూడా కీలకమైన మలుపులోనే ఉంది. స్పెషల్ సాంగ్స్, డిజిటల్ ప్రాజెక్ట్‌లతో హడావుడి చేస్తున్నా? సోలో హీరోయిన్‌గా .. బలమైన పాత్రలతో సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది.

ఇక జాతీయ ఉత్తమ నటిగా నీరాజ‌నాలు అందుకున్న‌ కీర్తి సురేష్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. `మహానటి` తర్వాత ఆ స్థాయి గుర్తింపునిచ్చే? మరో బలమైన సక్సెస్ పడలేదు. ప్రయోగాత్మక పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ చిత్రాలు చేసినా? అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలివ్వ‌లేదు.దీంతో అమ్మ‌డి కెరీర్ ఊగిసలాటలో పడింది. కొత్త తరం భామల తాకిడి పెరుగుతున్న నేప‌థ్యంలో సీనియర్ భామ‌ల‌కు మేకర్స్ నుంచి అవ‌కాశాలు త‌గ్గిపోతున్నాయి.

పరిశ్రమలో గ్లామర్, టాలెంట్ ఎంత ఉన్నా? బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రేట్ లేకపోతే క్వీన్‌లుగా వెలిగిన వారైనా? సైడ్ అయిపోక తప్పదనేది మరోసారి రుజువవుతోంది. యంగ్ జనరేషన్ హీరోయిన్లు దూసుకొస్తుండ‌టం మేకర్స్ కూడా కొత్త ముఖాల వైపు మొగ్గు చూపుతుండటంతో సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా కమర్షియల్ మాస్ చిత్రాలలో లీడ్ రోల్స్ దక్కడం గగనంగా మార‌డం వారి కెరీర్‌కు పెద్ద మైనస్‌గా మారుతోంది.

మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ముద్దుగుమ్మలు పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రొటీన్ కమర్షియల్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలు .. ఓటీటీ లో కంటెంట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటేనే మళ్లీ రేసులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ప్ర‌యాణం మాత్రం వీరంద‌రికీ భిన్నంగానే ఉంది. కొన్ని ప‌రాజ‌యాలు ఎదురైనా? అమ్మ‌డి స్టార్ డ‌మ్ మాత్రం ఎక్క‌డా కింగ లేదు. అవ‌కాశాలు అమ్మ‌డి కోసం క్యూలో ఉన్నాయి అన్న‌ది కాద‌న‌లేని నిజం

Tags:    
  • kajalaggarwal 
  • tamannaah 
  • keerthysuresh 
  • nayanthara 
  • tollywood 
  • seniorheroines 

Similar News

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?

2026-11-18 09:52 GMT

క‌రాటే చంద్ర‌న్ కోసం క‌రాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు!

2026-11-18 09:51 GMT

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

2026-11-18 07:46 GMT

గ్రీస్ వెకేషన్‌లో స్టార్‌క‌పుల్ రొమాన్స్.. వ‌య‌సు ఒక అంకె మాత్ర‌మే!

2026-11-18 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS