కరాటే చంద్రన్ కోసం కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు!
| ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించిన ఫహద్ ఫాజిల్, తనకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా ‘కరాటే చంద్రన్’ అంటున్నారు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కరాటే శిక్షణ తీసుకుంటున్నారు. షూటింగ్ ఆగిపోయిందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాయ్ దర్శకత్వంలో ఫహద్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పుష్ప సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించాడు. కానీ ఈ పాత్ర తన కెరీర్ అత్యుత్తమమైనది కాదని అతడు ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. జాతీయ అవార్డ్ గెలుచుకున్న `ట్రాన్స్` చిత్రంలో మోసగాడైన ఫాస్టర్ పాత్రతో మెప్పించాడు. ఇటీవల రాజమౌళి కాంపౌండ్ లో `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` మూవీతోను ఆకట్టుకున్నాడు.
కానీ వీటన్నిటి కంటే తనకు పేరు తెచ్చే సినిమా `కరాటే చంద్రన్` అంటున్నాడు.. కరాటే నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అతడు చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయిందని ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ లేదని ఫహద్ ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ఎంపిక చేసుకున్న పాత్ర కోసం వందశాతం ఇన్వాల్వ్ అయ్యి పని చేయడం ఫహద్ స్టైల్. ఇంతకుముందు విక్రమ్, పుష్ప, పుష్ప 2, ట్రాన్స్ సహా పలు మలయాళీ క్లాసిక్స్ లో అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. మరోసారి కరాటే చంద్రన్ గా అతడు అత్యుత్తమమైన మార్కులు అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు.
గతంలో `మహేశింటే ప్రతీకారం` వంటి విజయవంతమైన చిత్రాలకు దిలీష్ పోతన్ వద్ద కో డైరెక్టర్‌గా పనిచేసిన రాయ్ ఈ చిత్రంతో స్వతంత్ర దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ప్రముఖ మలయాళ రచయితలు ఎస్. హరీష్ -వినోయ్ థామస్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా తమ భావన స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, గౌతమి నాయర్, అపర్ణ బాలమురళి, నజ్రియా నజీమ్ తదితరులు నటిస్తున్నారు.
తమ పాత్రల కోసం కరాటే నేర్చుకున్న స్టార్లు:
సినిమాల్లో తమ పాత్రలకు సహజత్వం తీసుకురావడానికి.. యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా స్వయంగా చేయడానికి పలువురు స్టార్లు ప్రత్యేకంగా కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాకుండా తమ్ముడు, ఖుషి, బద్రి, జానీ వంటి చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే బాలీవుడ్ `ఖిలాడీ` అక్షయ్ కుమార్ తన యాక్షన్ స్టంట్స్‌తో ఆకట్టుకునే టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమ్వాల్ తమ సినిమాల కోసం కరాటే- తైక్వాండో వంటి యుద్ధ కళల్లో ప్రత్యేక శిక్షణ పొంది రియల్ స్టంట్స్‌తో అదరగొట్టారు.
కేవలం హీరోలే కాకుండా నటీమణులు కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. దీపికా పదుకొణె చాందినీ చౌక్ టు చైనా చిత్రం కోసం కరాటే, జుజిట్సు నేర్చుకుని డూప్ లేకుండా పోరాట సన్నివేశాల్లో నటించారు. మరోవైపు తమిళ స్టార్ సూర్య సెవెంథ్ సెన్స్ సినిమాలో బోధిధర్ముడి పాత్ర కోసం కరాటే- కుంగ్ ఫూ మెళకువలు నేర్చుకోగా.. తాజాగా మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ తన కొత్త సినిమా కోసం ప్రత్యేకంగా కరాటేలో శిక్షణ తీసుకుని తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్నారు. ఇలా వెండితెరపై ప్రేక్షకులకు అసలైన యాక్షన్ అనుభూతిని అందించేందుకు మన స్టార్స్ ఎంతో శ్రమిస్తున్నారు.