• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సక్సెస్ వచ్చినా? కష్టం...

సక్సెస్ వచ్చినా? కష్టం వచ్చినా? వారే దిక్కు!

| సినిమా షూటింగ్‌లు, బిజీ షెడ్యూళ్ల మధ్య కూడా పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్ ఆధ్యాత్మిక యాత్రలకు సమయం కేటాయిస్తున్నారు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్, జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి వంటి హీరోలతో పాటు నమ్రత, స్నేహారెడ్డి, తమన్నా, నయనతార కూడా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-18 07:09 GMT

సినిమా రంగం అంటే నిత్యం హడావుడి.. షూటింగ్ టెన్షన్లు.. బాక్సాఫీస్ లెక్కలతో నిండి ఉండే రంగుల ప్రపంచం. తెరపై కోట్లాది మందిని అలరించే స్టార్ హీరోలు.. హీరోయిన్లు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ? ఏదైనా కొత్త సినిమా మొదలెట్టే ముందు గానీ లేదా సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన తర్వాత గానీ దైవ దర్శనం చేసుకోవడాన్ని సౌత్ ఇండియన్ స్టార్స్ బలమైన సెంటిమెంట్‌గా భావిస్తారు. ముఖ్యంగా తిరుమల నుంచి శబరిమల వరకు కొన్ని ప్రముఖ క్షేత్రాలంటే వీరికి ఎనలేని భక్తి.

ఆధ్యాత్మికత అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రతి ఏటా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతతను వెతుక్కునే తలైవా కుటుంబంతో కలిసి తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడా ఆయనకు ఎంతో ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ విషయానికొస్తే.. హనుమాన్ భక్తులైన వీరు ఎలాంటి ముఖ్యమైన పని తలపెట్టినా? తిరుమల వెంకన్నతో పాటు హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి తప్పకుండా వెళ్తారు. ముఖ్యంగా రామ్ చరణ్ ప్రతి ఏటా 41 రోజుల పాటు ఎంతో నిష్టతో అయ్యప్ప దీక్ష చేపడుతారు. కాలి నడకన శబరిమల వెళ్లడం ఆయన భక్తికి నిదర్శనం.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఆధ్యాత్మిక యాత్రలలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తరచూ కుమారులు యాత్ర, లింగలతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంటారు. తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇక కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి కర్ణాటకలోని పురాతన కేశవనాథేశ్వర ఆలయానికి పంచెకట్టులో, బురద దారుల్లో నడుచుకుంటూ వెళ్లిన ఫోటోలు గతంలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.

హీరోలే కాదు స్టార్ ఫ్యామిలీస్ , హీరోయిన్లు కూడా దైవ భక్తిలో ఎక్కడా తగ్గరు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పిల్లలతో కలిసి అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుని తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా పిల్లలతో తరచుగా తిరుపతి వెళ్తుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా అయితే ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోని భస్మ హారతిలో పాల్గొనడంతో పాటు కాశీ విశ్వనాథుడు, ముంబై సిద్ధివినాయక ఆలయాలను సందర్శిస్తుంటారు. నయనతార - విఘ్నేష్ శివన్ జంట కూడా పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని .. పలు పురాతన ఆలయాలను దర్శించుకుని భక్తిని చాటుకుంటున్నారు.

సినీ ప్రపంచంలో ఎంతటి స్టార్‌డమ్.. కోట్లాది రూపాయల సంపాదన ఉన్నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ దైవ కృప ఉండాల్సిందేనని సెలబ్రిటీలు బ‌లంగా నమ్ముతారు. సక్సెస్ వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పుకోవడానికి.. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి పుణ్యక్షేత్రాల సందర్శన వారికి గొప్ప శక్తిని ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    
  • southindianstars 
  • rajinikanth 
  • chiranjeevi 
  • ramcharan 
  • dhanush 
  • jrntr 
  • rishabshetty 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS