'మైసా' కోసం రణబాలి రానున్నాడా?
| రష్మిక మందన్న నటించిన ‘మైసా’ షూటింగ్ పూర్తయింది. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వీకెండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉండగా, రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా హాజరుకావచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందులో రష్మిక గోండు మహిళగా కనిపించనుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘మైసా’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పబ్లిసిటీ హడావుడి మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వీడియోలు, పోస్టర్స్‌ను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో కౌండ్ డౌన్ పోస్టర్స్ ను ప్రతిరోజూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నేపథ్యంకు అనుగుణంగా విభిన్నమైన పోస్టర్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు ఉన్నాయి. రెగ్యులర్ ఆడియన్స్‌కి సినిమాను చేరువ చేయడం కోసం ప్రమోషన్ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా మైసాను సాధ్యం అయినంత ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రష్మిక మందన్న మైసా మూవీ కోసం...
విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత రష్మిక మందన్న నుంచి రాబోతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఇదే కావడంతో రౌడీ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా చూస్తున్నారు. ఆకట్టుకునే కథ, కథనంతో ఈ సినిమాను రవీంద్ర పుల్లె తెరకెక్కించాడు. గోండు తెగలకు సంబంధించిన పీరియాడిక్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా కోసం రష్మిక చేసిన యాక్షన్ సన్నివేశాల గురించి విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ప్రస్థావించిన విషయం తెల్సిందే. అడవులు, గుట్టల్లో సాహసోపేతమైన లొకేషన్స్‌లో రష్మిక మందన్న షూటింగ్‌లో పాల్గొంది. ఆ సమయంలో రష్మికకి ప్రమాదం కూడా జరిగిన విషయం తెల్సిందే. రష్మిక తిరిగి కోలుకుని షూటింగ్‌లో పాల్గొని, ఏమాత్రం భయపడకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు చేయడం ద్వారా స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపించుకుంది.
మైసా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..
మైసా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వీకెండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడం ఖాయం అని, ఆ ఈవెంట్‌కి రష్మిక మందన్నతో పాటు ఆమె భర్త రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇంతకు ముందు రష్మిక మందన్న నటించిన గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, సినిమా తో రష్మిక మందన్నకు మంచి పేరు దక్కింది. రష్మిక మందన యాక్టింగ్‌కు అవార్డ్‌లు రావాల్సిందే అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు మైసాతో మరోసారి రష్మిక సర్‌ప్రైజ్ చేయడం ఖాయం అని ఆమె సన్నిహితులు అంటున్నారు. కనుక విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అయితే కచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ...
మైసా సినిమా విషయానికి వస్తే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో గోండు మహిళ పాత్రలో రష్మిక కనిపించబోతుంది. ఆమె లుక్ తో పాటు, భాష, బాడీలాంగ్వేజ్ సైతం చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌లో అన్ని భాషల ప్రేక్షకులను మైసా ఆకట్టుకుంటుంది అనే విశ్వాసం నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్న కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అనే విశ్వాసంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు రావు రమేష్, సముద్రఖని, ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి సంయుక్తంగా నిర్మించారు. రష్మిక చేసిన రియల్ యాక్షన్ స్టంట్స్, కేరళ అడవుల్లో డూప్ లేకుండా చేసిన జంప్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నాయి.