• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అత్తగారింట్లో సమంత సీమంతం...

అత్తగారింట్లో సమంత సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్!

| సమంత తన అత్తగారి కుటుంబ సభ్యులతో కలిసి సీమంతం వేడుకను జరుపుకుంది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి జరిగిన ఈ వేడుక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలో బిడ్డకు స్వాగతం పలకనున్న సమంతకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

By - Madhu Reddy
Update: 2026-11-18 07:08 GMT

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే ఈమె మరోసారి అత్తగారి కుటుంబంతో కలిసి సీమంతం వేడుకలను జరుపుకుంది. ఈ ఫోటోలను తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది సమంత. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్న ఈమె.. తాజాగా మరో వేడుక జరుపుకుంది. తన అత్తగారి ఫ్యామిలీతో కలిసి సీమంతం వేడుకను సెలబ్రేట్ చేసుకుంది.




 


ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత అధికారికంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది పెద్దలు అందరూ కలిసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే తన భర్తతో కలిసి ఈ వేడుక జరుపుకుంది. మొత్తానికైతే అత్తగారి కుటుంబ సభ్యులతో జరిగిన ఈ సీమంతం వేడుక ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో సమంతకు అభిమానులు, సినీ సెలబ్రిటీలు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




 


సమంత విషయానికి వస్తే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును రెండవ వివాహం చేసుకుంది. గతంలో అక్కినేని వారసుడు నాగచైతన్యను ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాలుగేళ్లకే వివాహం లో ఒడిదుడుకులు రావడంతో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత రాజ్ తో ప్రేమలో పడ్డ ఈమె.. అతడిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్ లలో పనిచేశారు. అదే సమయంలో ప్రేమ చిగురించగా.. గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. పైగా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. పైగా ఈ ఏడాదిలోనే వీరిద్దరూ తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు.




 


ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. పైగా ఈ చిత్రానికి సమంత సహనిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం. ఇక ప్రస్తుతం తమిళంలో ప్రముఖ ఓటీటీ ఛానల్ సోనీ లివ్ కోసం సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ కుకింగ్ షోలో సెలబ్రిటీ జడ్జిగా వ్యవహరిస్తోంది.



 


అలాగే రక్త బ్రహ్మండ్ అనే సిరీస్ లో కూడా ఈమె నటించాల్సి ఉండగా.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా వాయిదా వేశారు. పైగా ఈ వెబ్ సిరీస్ దర్శకుడు తన భర్త రాజ్ కావడం మరో విశేషం. ఏది ఏమైనా ప్రెగ్నెన్సీలో కూడా తన పని తాను చేసుకుంటూ పోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న సమంత.. డెలివరీ తర్వాత అయినా విశ్రాంతి తీసుకోవాలని, తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు.





 


Tags:    
  • samantha 
  • samantharuthprabhu 
  • rajnidimoru 
  • seemantham 
  • babyshower 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS