• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోలు మారుతున్నారు.....

హీరోలు మారుతున్నారు.. కానీ దర్శకులే..

| నాని, నాగచైతన్య వంటి హీరోలు కొత్త జానర్లతో తమ ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బోయపాటి శ్రీను, కొరటాల శివ వంటి దర్శకులు తమకు హిట్లు ఇచ్చిన పాత ఫార్ములానే కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల కూడా ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’లో అదే రా ట్రీట్‌మెంట్‌ను మరింత పెంచారు. కథలతో పాటు కథనం, మేకింగ్‌లోనూ కొత్తదనం చూపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By - M Prashanth
Update: 2026-11-18 05:48 GMT

నాని ఒకప్పుడు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలతో ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు 'దసరా', 'హిట్ 3', 'ది ప్యారడైజ్' వంటి సినిమాలతో మాస్ ఇమేజ్ కోసం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. నాగచైతన్య కూడా 'తండేల్' తర్వాత 'వృషకర్మ'తో అడ్వెంచర్ జానర్‌లోకి వెళ్తున్నారు. ఇలా హీరోలు తమ పాత ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే, కొందరు దర్శకులు మాత్రం తమకు హిట్ ఇచ్చిన ఫార్ములాను వదలడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బోయపాటి శ్రీను సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి సినిమాల్లో హీరోను పవర్‌ఫుల్‌గా చూపించడం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విలన్లతో గట్టిగా డైలాగ్స్ చెప్పించడం బాగా వర్కౌట్ అయింది. కానీ 'స్కంద', 'అఖండ 2' విషయంలో అదే తరహా ఎలివేషన్స్ ఆశించినంతగా మెప్పించలేకపోయాయి. హీరోలు మారినా బోయపాటి సినిమాల్లో యాక్షన్ ట్రీట్‌మెంట్ మాత్రం పెద్దగా మారడం లేదనే అభిప్రాయం ఉంది.

కొరటాల శివ విషయంలోనూ మరో తరహా ఫార్ములా కనిపిస్తుంది. 'శ్రీమంతుడు'లో ఊరిని దత్తత తీసుకోవడం, 'జనతా గ్యారేజ్'లో ప్రకృతిని కాపాడటం, 'భరత్ అనే నేను'లో రాజకీయ వ్యవస్థను మార్చడం వంటి అంశాలను తీసుకున్నారు. కథలు వేరైనా హీరో సమాజం కోసం ఏదో చేయాలనే పాయింట్ కొనసాగింది. ఆ సినిమాలు హిట్లు కావడంతో ఈ పద్ధతి బాగా కలిసొచ్చింది. అయితే 'ఆచార్య'లో అదే తరహా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక దేవర మొదటి భాగం హిట్టయినా ఆ రిజల్ట్ రెండో భాగానికి నమ్మకం ఇవ్వడం లేదు. దీంతో క్లారిటీ రావడం లేదు.

ఇక శ్రీకాంత్ ఓదెల 'దసరా'తో నానిని మాస్ హీరోగా చూపించి మంచి విజయం అందుకున్నారు. కానీ రెండో సినిమా 'ది ప్యారడైజ్'లో యాక్షన్, వయలెన్స్ మరింత పెంచారు. మొదటి భాగం, ఇంటర్వెల్ వంటి ఎపిసోడ్స్‌కు ప్రశంసలు వచ్చినా సెకండాఫ్ నెమ్మదిగా సాగిందనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల నిడివి, భారీ డ్రామా సినిమాకు మైనస్ అయ్యాయి. మొదటి సినిమాలో వర్కౌట్ అయిన రా ట్రీట్‌మెంట్‌ను మరింత పెంచడం ఈసారి పూర్తిగా ఉపయోగపడలేదు.

అయితే దర్శకుడికి సొంత స్టైల్ ఉండటం తప్పేమీ కాదు. రాజమౌళి సినిమాల్లో భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉంటాయి. సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, క్లాష్ లను ప్రాధాన్యం ఉంటుంది. కానీ వీళ్లు ప్రతి సినిమాకు కొత్త నేపథ్యాన్ని, పాత్రలను సిద్ధం చేసుకుంటారు. అదే సమయంలో కొందరు దర్శకులు నేపథ్యం మార్చినా హీరో ప్రవర్తన, విలన్ పాత్రలు, యాక్షన్ సన్నివేశాలను పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. దీంతో కొత్త సినిమా చూస్తున్నా గత చిత్రాల పోలికలు వస్తున్నాయి.

ప్రస్తుతం పెద్ద హీరోలు ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. బడ్జెట్లు కూడా భారీగా పెరిగాయి. అలాంటి ప్రాజెక్టుల్లో దర్శకుడు తనకు అలవాటైన ఫార్ములాతోనే సినిమా తీస్తే నిర్మాతకు రిస్క్ పెరుగుతుంది. పైగా ప్రేక్షకులు ఇప్పుడు ఇతర భాషల సినిమాలను కూడా చూస్తున్నారు. అందుకే హీరో కొత్త లుక్‌లో కనిపించడం ఒక్కటే సరిపోదు. దర్శకుడు కూడా కథ చెప్పే విధానంలో మార్పు చూపించకపోతే భారీ బడ్జెట్, స్టార్ కాంబినేషన్ ఉన్నా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు.

Tags:    
  • telugucinema 
  • boyapatisrinu 
  • koratalasiva 
  • srikanthodela 
  • nani 

Similar News

ఈషానే తరుణ్ భాస్కర్ సోల్‌మేట్.. పెళ్లి వార్తలపై తల్లి కామెంట్స్ వైరల్..!

2026-11-18 05:46 GMT

వారణాసి.. అలాంటి సర్‌ప్రైజ్ ఒక్కటి పడినా..

2026-11-18 05:43 GMT

మూడోసారి తల్లి అయిన నటి.. మామ్ అయితేనే క్రేజ్ ఎక్కువా?

2026-11-18 05:43 GMT

నేపోటిజం కామెంట్ల‌పై న‌ట‌ వార‌సురాళ్లు ర‌చ్చ ర‌చ్చ‌

2026-11-18 05:42 GMT

45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?

2026-11-18 03:37 GMT

“రామ్ చరణ్ నన్ను అన్నా అంటారు.. అఖిల్ చిరుని పెదనాన్న అంటారు..”

2026-11-18 03:36 GMT

చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ బయటపెట్టేసిన మెగాస్టార్..!

2026-11-18 03:36 GMT

ఈఎన్‌ఈ రిపీట్ USA థియేటర్స్ లిస్ట్

2026-11-18 03:08 GMT

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

Copyright @2026

Powered by Blink CMS