• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు లీక్స్.. కాకాలో ఆమె...

చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ బయటపెట్టేసిన మెగాస్టార్..!

| చిరంజీవి తన తాజా చిత్రం ‘కాకా’లో అనస్వర రాజన్ పాత్రపై ఆసక్తికరమైన క్లూ ఇచ్చారు. ‘ఆమె మాట్లాడదు, ఏమీ చెప్పదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమాలో అనస్వర మాట్లాడలేని అమ్మాయి పాత్రలో కనిపించనున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 13న విడుదల కానుంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-18 03:36 GMT

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన లీక్స్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటారు. ముఖ్యంగా సినిమా కథ, పాత్రలు, నటీనటుల గురించి ఆయన కొన్నిసార్లు దర్శకులు కన్నా ముందు లీక్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఇట్లు అర్జున సినిమా వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన తదుపరి చిత్రం కాకాలో హీరోయిన్ అనస్వర రాజన్ పాత్ర గురించి ఆయన చెప్పేసిన విషయం ఆసక్తికరంగా మారింది.

ఈ కార్యక్రమంలో అనస్వర రాజన్ గురించి ప్రస్తావించిన చిరంజీవి.. సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రకు సంబంధించిన వివరాలను ఇప్పుడే బయటపెట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. సినిమా విడుదలకు ఇంకా కేవలం ఒకటి నుంచి రెండు నెలలు మాత్రమే ఉన్నాయ, సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి అప్పుడే చూడాలని.. ఇప్పుడు తను లీక్ చెయ్యను అని సరదాగా అన్నారు.. ఈ సందర్భంగా అనస్వరను కూడా ప్రేక్షకులతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు.

అయితే చిరంజీవి ప్రశ్నకు అనస్వర రాజన్ లేదు సార్ అన్నట్టు సమాధానం ఇచ్చింది. తన పాత్ర గురించి ఎలాంటి వివరాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో చిరంజీవి వెంటనే స్పందిస్తూ.. 'అనస్వర రాజన్.. ఆమె మాట్లాడదు, ఏమీ చెప్పదు' అని అన్నారు. అంతేకాకుండా తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటే.. ఆ వీడియోను మరోసారి చూడాలని ప్రేక్షకులకు క్లూ ఇచ్చారు.

చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలతో ‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ పాత్ర.. సినిమాలో మాటలు మాట్లాడలేని అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారా? లేక ఆమె పాత్రకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ట్విస్ట్ ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక కాకా విషయానికి వస్తే, చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చిరంజీవి కె. సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. అనస్వర రాజన్‌తో పాటు నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, అనురాగ్ కశ్యప్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



లీక్ చేయను... చేయనంటూనే... #Kaaka సినిమాలో అనశ్వర రాజన్ పాత్ర ఎలా ఉండబోతుందో లీక్ చేసేసిన చిరంజీవి. #Chiranjeevi #AnaswaraRajan #ItlluArjuna #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/MgRu8vQsqk

— Tupaki (@tupaki_official) November 17, 2026


Tags:    
  • chiranjeevi 
  • kaaka 
  • anaswararajan 
  • bobbykolli 
  • kvnproductions 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS