• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిజ జీవితంలోనూ గ్రేట్.....

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

| సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు హాజరైన ఆయన, అనంతరం భార్య లత, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మనవళ్లతో కలిసి ఏథెన్స్‌లో పర్యటించారు. మనవళ్ల చేతులు పట్టుకుని నడుస్తున్న రజనీ ఫోటోలను సౌందర్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

By - Srikanth Kontham
Update: 2026-11-18 07:46 GMT

తెరపై విలన్లను ఎదిరించే మాస్ హీరోగా.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే తలైవాగా రజనీకాంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ సినిమా బ‌య‌ట ఓ సాధారణ కుటుంబ సభ్యుడిగా ముద్దుముద్దుగా మాట్లాడే తాతయ్యగా ఉండటానికే ఇష్టపడతారు. సాధారణంగా పబ్లిక్‌లో చాలా సింపుల్‌గా ఉండే రజనీకాంత్ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ లైమ్ లైట్‌కు దూరంగా ఉంచుతారు. అయితే తాజాగా ఆయన కుటుంబంతో కలిసి గ్రీస్ దేశంలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుక గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగ‌తి తెలిసింఏద‌. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రజనీకాంత్ కుటుంబ సమేతంగా గ్రీస్‌కు వెళ్లారు. పెళ్లి వేడుక ముగిసిన అనంత‌రం రజనీకాంత్ సతీమణి లత, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య , మనవళ్లతో కలిసి ఏథెన్స్ నగరంలో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను ఆయన కుమార్తె సౌందర్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోలలో రజనీకాంత్ మనవళ్లతో కలిసి రోడ్డుపై నడుస్తూ ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఒక చేత్తో భార్య లత చేయి .. మరో చేత్తో మనవళ్ల చేతులను పట్టుకుని నడుస్తున్న అరుదైన దృశ్యం హత్తుకుంటోంది. బ్రౌన్ కలర్ స్వెటర్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్, వైట్ స్కార్ఫ్ ,బ్లూ క్యాప్‌లో రజనీకాంత్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మరోవైపు బాధ్యతగల కుటుంబ పెద్దగా ఆ క్షణాలను ఆస్వాదించారు. `ఏథెన్స్‌లో మేము ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకున్నాం. ఈ లవ్‌లీ ఫ్యామిలీ ట్రిప్‌లోని ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాం` అని సౌందర్య క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు నిజ జీవితంలోనూ తలైవా గ్రేట్.. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ` అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ర‌జ‌నీ సినిమాల విషయానికి వస్తే ఇటీవల `జైలర్ 2` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మ‌రో చారిత్రాత్మక విజయాన్ని న‌మోదు చేసారు. ప్రస్తుతం అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో `ధర్మన్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా? కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని మాత్రం ఆయన ఏమాత్రం మిస్ చేయలేదని ఈ ట్రిప్ నిరూపిస్తోంది.

Tags:    
  • rajinikanth 
  • soundarya 
  • aishwaryarajinikanth 
  • anirudh 
  • greecevacation 

Similar News

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

గ్రీస్ వెకేషన్‌లో స్టార్‌క‌పుల్ రొమాన్స్.. వ‌య‌సు ఒక అంకె మాత్ర‌మే!

2026-11-18 07:46 GMT

స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!

2026-11-18 07:24 GMT

'మైసా' కోసం రణబాలి రానున్నాడా?

2026-11-18 07:14 GMT

కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌గా బ్రాడ్ పిట్?

2026-11-18 07:13 GMT

విమర్శలను సైతం అవకాశాలుగా మ‌లుచుకుంటోన్న న‌యా స్టార్!

2026-11-18 07:12 GMT

సక్సెస్ వచ్చినా? కష్టం వచ్చినా? వారే దిక్కు!

2026-11-18 07:09 GMT

అత్తగారింట్లో సమంత సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్!

2026-11-18 07:08 GMT

గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన సాత్విక వీరవల్లి..ఈ క్రేజ్ ఏంటి తల్లీ!

2026-11-18 07:08 GMT

నలుగురు స్టార్ హీరోలు.. ఆదిత్య ధర్ గురి పెద్దదే!

2026-11-18 07:07 GMT

హీరోలు మారుతున్నారు.. కానీ దర్శకులే..

2026-11-18 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS