'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?
| విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, అభిమానులను పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఎలివేషన్లు, ఎమోషనల్ సన్నివేశాలు తగ్గడం, బలమైన విలన్ లేకపోవడం మైనస్‌లుగా చెబుతున్నారు. అయితే రాయలసీమ యాసలో విజయ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ను సాధించింది. కానీ విజయ్ దేవరకొండ అభిమానులను ఈ సినిమా పూర్తిస్థాయిలో అలరించలేదనే కామెంట్లైతే సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు విజయ్ తన స్టాండర్డ్స్ ను మార్చుకుంటూ డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నప్పటికి అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోతున్నాయి. రణబాలి సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకున్నప్పటికి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి...
రణబాలి లో మిస్ అయ్యిందేంటి?
రాహుల్ సాంకృత్యాయన్ కథ విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేశాడు. అన్ని క్రాఫ్ట్ లో నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ రాబట్టడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు. కానీ సినిమా చూస్తున్నంత సేపు బుక్ చదువుతున్న ఫీల్ కలుగుతుంది. అయితే సినిమాలో హై ఎలివేషన్, ఎమోషనల్ సన్నివేశాలు కొంతవరకు కరువయ్యాయి. దాని వల్ల కూడా ఈ సినిమాని ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఆదరించలేకపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి చాలా చోట్ల ఎలివేషన్స్ వర్కౌట్ అయినప్పటికి ఇలాంటి మాస్ సినిమాలో ఇంకా భారీ ఎలివేషన్లు పడితే సినిమా మీద హై పెరగడమే కాకుండా ప్రేక్షకుడు సినిమాను చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయగలుగుతాడు. దానికి తోడుగా ఇందులో సరైన విలన్ లేడు. విలనిజం కూడా అనుకున్న స్థాయి వర్కౌట్ కాలేదు. మమ్మీ విలన్ ఆర్నాల్డ్ ఓసో ను తీసుకువచ్చినప్పటికి ఆయనను అనుకున్న స్థాయిలో వాడుకోలేదనే భావన కలుగుతుంది. మొత్తానికైతే భారీ విజయం సాధించాల్సిన సినిమా ఒక మోస్తరు సక్సెస్ ను మాత్రమే సాధించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తెలంగాణ నుంచి రాయలసీమ యాస...
విజయ్ కెరీర్ స్టార్టింగ్ లో తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. కానీ ఈ మూవీలో రాయలసీమ యాస లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి ప్రతి ఒక్కరినీ అలరించాడు. తను ప్రతి పాత్ర కోసం చాలా కష్టపడుతాడు అనే దానికి ఈ సినిమాలోని పాత్రను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. రాబోయే సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో కనిపించి తనను తాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం 'రౌడీ జనార్ధన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.