• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నువ్వు ఇండస్ట్రీని...

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

| సూర్య నటించిన ‘సీన్’ సినిమాలో నాస్లెన్ నటనపై స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రశంసలు కురిపించారు. అతడిలో అద్భుతమైన కరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నాయని, భవిష్యత్తులో ఇండస్ట్రీని ఏలుతాడని కొనియాడారు. సూర్య నటన, దర్శకుడు జిత్తు మాధవన్ మేకింగ్‌ను కూడా అట్లీ అభినందించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-11 17:30 GMT

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `సీన్` త‌మిళ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో డివైడ్ టాక్ వ‌చ్చినా మాతృక‌లో మాత్రం మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. సూర్య స‌హా మ‌ల‌యాళ న‌టుడు నాస్లెన్ న‌ట‌కు మంచి ప్ర‌శంస‌లొస్తున్నాయి. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుంచి సినిమాకు మంచి పీడ్ బ్యాక్ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ నాస్లెన్ న‌ట‌న‌పై త‌న‌దైన శైలిలో ప్ర‌శంసించారు. నాస్లెన్ స్క్రీన్ ప్రెజెన్స్ ..పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయానన్నారు. `నాస్లెన్.. మై గాడ్ ఏంటి నటన? నీలో అద్భుతమైన కరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది.

నువ్వు కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని రూల్ చేస్తావు` అంటూ ఆకాశానికి ఎత్తేశారు. నాస్లెన్ తోపాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణులపై కూడా అట్లీ ప్రశంసలు కురిపించారు. సూర్య నటన అద్భుతంగా ఉందని..ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే అచ్చమైన కమర్శియ‌ల్ ఎంటర్‌టైనర్ అని అభివర్ణించారు. జిత్తు మాధవన్ మేకింగ్ స్టైల్ అంటే ఎప్పుడూ ఇష్టమని..ఈ సినిమాతో ఆయన మరోసారి తన ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. నాస్లెన్ విషయానికి వస్తే..వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ‌ న‌టుడు ట్యాలెంట్ మలయాళానికే పరిమితం కాలేదు.

ఇతర ఇండస్ట్రీల స్టార్ డైరెక్టర్లు కూడా ప్ర‌శంశిస్తున్నారు. పాన్-ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న నాస్లెన్ టాలెంట్ ఇండస్ట్రీలో పెద్ద వాళ్ల దృష్టిని కూడా ఆకర్షిస్తోందనడానికి అట్లీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పొచ్చు.

స్టార్ డైరెక్టర్ రేంజ్‌లో ఉన్న అట్లీ స్వయంగా ఓ యువ నటుడిని ఉద్దేశించి ఇండస్ట్రీని ఏలుతావు అని బహిరంగంగా ప్రశంసించడం చిన్న విషయం కాదు. దీంతో సోషల్ మీడియాలో నాస్లెన్ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ప్రశంస‌తో నాస్లెన్ క్రేజ్ రెట్టింపు అవుతుంది. ఇక‌పై ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు.

అట్లీ సైతం పిలిచి అవ‌కాశం ఇచ్చినా? ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త‌వ్ంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా `రాకా` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్లోబ‌ల్ రేంజ్ లో రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉంది. మ‌రి ఈ సినిమా నెస్లెన్ కి ఏదైనా అవ‌కాశం ఇస్తారేమో చూడాలి.

Tags:    
  • suriya 
  • naslen 
  • atlee 
  • scene 
  • jithumadhavan 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS