అవమానాలు పడితేనే టాప్ హీరో అవుతారా?
ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంట్రీ ఇచ్చినవారే కావడం విశేషం... అయినప్పటికీ వాళ్ళను వాళ్లు మార్చుకొని టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని సక్సెస్ అయ్యారు.
సినిమా ఇండస్ట్రీకి వచ్చి సత్తా చాటాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందులో కొందరు మాత్రమే ధైర్యం చేసి ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. వాళ్లలో కొంతమంది ఇక్కడ ఉండే కష్టాలను భరించలేక ఇంటికి వెళ్లిపోతారు. ఇక్కడ ఎదురయ్యే ఇబ్బందులు భరించడం అందరి వల్ల కాదు. ఇండస్ట్రీ ఎవరిని అక్కున చేర్చుకుంటుంది ఎవరిని ఇండస్ట్రీ నుంచి పంపించేస్తుందనేది ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగితేనే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంట్రీ ఇచ్చినవారే కావడం విశేషం... అయినప్పటికీ వాళ్ళను వాళ్లు మార్చుకొని టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని సక్సెస్ అయ్యారు. ఎవరికి ఏది ఈజీగా రాలేదనేది వాస్తవం. ముఖ్యంగా ఎన్నో రోజులు పస్తులుండి అవకాశాల కోసం ఎదురుచూసి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఇండస్ట్రీలో తమ సత్తాను చాటుకున్న వాళ్ళులో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు.
ఆయన స్వశక్తితో అవకాశాలను అందుకొని విలన్ గా చేసి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సుప్రీం హీరోగా మారాడు, ఫైనల్ గా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే మెగాస్టార్ అయ్యాడు. రామ్ చరణ్ కి హీరోగా ఈజీగా యాక్సిస్ దొరికినప్పటికి ఆయన కూడా చాలా కష్టపడి మరి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఎంతోమంది తన లుక్స్ బాగాలేవు యాక్టింగ్ లో ఇంకా మెళుకువలు నేర్చుకోవాలి అంటు విమర్శలు చేశారు.
అయినా కూడా వాటన్నింటిని భరిస్తూ తనను తాను ఒక శిల్పి లాగా చెక్కుకుంటూనే ఎప్పటికప్పుడు నిత్య కృషీవలుడు లాగా కష్టపడుతూ ముందుకు సాగాడు కాబట్టే రంగస్థలం సినిమాతో వాళ్ళందరికి సమాధానం చెప్పాడు. ఎవరైతే తనను అవమానించారో వాళ్ళ చేతే శభాష్ అనిపించుకున్నాడు. ఎవరైతే తను హీరోగా పనికిరాడని అన్నారో వాళ్లే రామ్ చరణ్ నెంబర్ వన్ హీరోగా మారతాడు అంటూ కితాబ్ ఇచ్చారు...చిరంజీవి రామ్ చరణ్ అనే కాదు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఏదో ఒక ఫేజ్ లో కష్టపడి పోరాటం చేసి గెలిచినవారే... ప్రతి స్టార్ హీరో ఫ్లాప్ సినిమాలను తట్టుకొని సక్సెస్ఫుల్ సినిమాలను చేయడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
ప్రేక్షకులు మన నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయాల మీద క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని వాళ్ళు మార్చుకొని సినిమాలు చేసిన వాళ్లు మాత్రమే ఇక్కడ నిలబడ్డారు. అవమానాలు అనేవి కొత్తేమీ కాదు ఏ రంగంలో ఉన్న అవమానించే వారు మాత్రం లేకపోలేదు. కానీ దానికి భయపడి మనం వెనక్కి తగ్గితే మనల్ని మనం కోల్పోవడమే కాకుండా ఓటమిని కూడా అంగీకరించిన వాళ్ళం అవుతాము. వాటన్నింటిని పక్కనపెట్టి లక్ష్యం మీద ఫోకస్ చేసి ముందుకు సాగిన వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. వాళ్లు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. స్క్రీన్ మీద మనకు కనిపించే హీరోలు పడే కష్టాన్ని చూసి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది...