RC17 కోసం మేక‌ర్స్ కొత్త గేమ్.. ఒక్కో క్యాస్టింగ్ తో ఒక్కో స‌ర్‌ప్రైజ్?

సాధారణంగా ఒక సినిమాలోని కీలక నటీనటుల పేర్లను ఒకేసారి అనౌన్స్ చేయ‌డం వల్ల క్యాస్టింగ్‌కు సంబంధించిన ఆసక్తి ఒక దశలోనే పూర్తవుతుంది.

Update: 2026-09-16 18:30 GMT

RC17 విషయంలో ఇప్పటివరకు వినిపిస్తున్న అప్‌డేట్స్ చూస్తే.. సినిమా కథ, రిలీజ్ డేట్, గ్లింప్స్ వంటి రెగ్యులర్ అంశాల కంటే ముందే మరో అంశం చర్చలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదే క్యాస్టింగ్. ఆర్సీ17లో భారీ క్యాస్టింగ్ ను మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ప్ప‌టికీ, సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని ఒకేసారి బయటపెట్టకుండా, సరైన సమయంలో ఒక్కో పేరును రివీల్ చేస్తే.. అది కేవలం అనౌన్స్‌మెంట్‌గా కాకుండా ప్రతి దశలో కొత్త బజ్ క్రియేట్ చేసే ప్రమోషనల్ టూల్‌గా మారే అవకాశం ఉంటుంది. దీంతో సినిమా కంటెంట్‌ను పూర్తిగా బయటపెట్టకుండానే ఆడియన్స్ అటెన్షన్‌ను కొనసాగించవచ్చు.

సాధారణంగా ఒక సినిమాలోని కీలక నటీనటుల పేర్లను ఒకేసారి అనౌన్స్ చేయ‌డం వల్ల క్యాస్టింగ్‌కు సంబంధించిన ఆసక్తి ఒక దశలోనే పూర్తవుతుంది. కానీ రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ క‌ల‌యిక‌లో రూపొంద‌నున్న RC17 విషయంలో మాత్రం ఈ ఫార్ములాకు భిన్నంగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాలోని ప్రతి కీలక పాత్రకు సంబంధించిన నటుడిని వేర్వేరు సందర్భాల్లో పరిచయం చేస్తే.. ప్రతి కొత్త పేరు ఒక చిన్న ప్రమోషనల్ ఈవెంట్‌లా మారుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోతో కలిసి మరో ప్రముఖ నటుడు కనిపించనున్నాడనే అప్‌డేట్ వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో డిస్క‌ష‌న్ మొదలయ్యే అవకాశం ఉంటుంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్యాస్టింగ్‌పై క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఒక రకమైన ప్రమోషన్‌గా మారుతోంది. ఎవరెవరు సినిమాలో భాగం కానున్నారు? ఏ పాత్రలో కనిపించబోతున్నారు? వారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతవరకు ఉండబోతోంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెంటనే ఇవ్వకుండా ఉంచితే సినిమాపై క్యూరియాసిటీ కొనసాగి హైప్ పెరిగే అవ‌కాశ‌ముంది. ఒకవైపు అఫీషియ‌ల్ గా కంటెంట్ ను రివీల్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే, మరోవైపు సినిమాపై డిస్క‌షన్ మాత్రం కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఇది వర్కౌట్ అయితే RC17 ప్రమోషన్స్ ఒకే దశలో ముగిసిపోయే క్యాంపెయిన్‌గా కాకుండా.. వరుస అప్‌డేట్స్‌తో నడిచే ప్రాసెస్‌గా మారొచ్చు. మొదట ఒక క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్, ఆ తర్వాత మరో కీలక పాత్రకు సంబంధించిన రివీల్, ఆపై ఫస్ట్ లుక్ లేదా ఇతర ప్రమోషనల్ కంటెంట్.. ఇలా ప్రతి దశలో కొత్త అంశాన్ని పరిచయం చేసే స్పేస్ ఉంటుంది.

అయితే ఇవన్నీ మేకర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన ప్రమోషనల్ ప్లాన్ కాదు. ప్రస్తుత క్యాస్టింగ్ డిస్క‌ష‌న్స్ ను బట్టి వ‌స్తున్న వార్త‌లు మాత‌ర్మే. నిజంగా RC17 టీమ్ ఇదే తరహా స్ట్రాటజీని అనుసరిస్తుందా? లేక త‌మ క్యాస్టింగ్ మొత్తాన్ని ఒకేసారి రివీల్ చేస్తుందా? అనేది అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ తోనే క్లారిటీ వస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. RC17లో ఎవరెవ‌రు భాగం కానున్నార‌నే ప్రశ్న కూడా సినిమాపై ఆసక్తిని పెంచే మరో ప్రమోషనల్ హుక్‌గా మారుతోంది.

Tags:    

Similar News