ప్రశంసలున్నాయి.. ప్రాజెక్టులు ఎందుకు లేవు?
మృణాల్ ఠాకూర్ పేరు గత కొన్నేళ్లుగా తెలుగు, హిందీ సినీ వర్గాల్లో తరచూ వినిపిస్తున్నప్పటికీ, ఆమె కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మృణాల్ ఠాకూర్ పేరు గత కొన్నేళ్లుగా తెలుగు, హిందీ సినీ వర్గాల్లో తరచూ వినిపిస్తున్నప్పటికీ, ఆమె కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మంచి యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, ప్రేక్షకాదరణ ఉన్నప్పటికీ పెద్ద ప్రాజెక్టులు వరుసగా ఆమె అకౌంట్ లో పడకపోవడానికి రెమ్యూనరేషన్ కూడా ఒక కారణమా అనే డిస్కషన్ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల మార్కెట్ గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు లిమిటెడ్ గా ఉండటం, పాన్- ఇండియా ప్రాజెక్టుల్లో సెలెక్షన్ ప్రాసెస్ మరింత పోటీగా మారడం వల్ల నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో లెక్కలు మరింత కఠినంగా మారాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక హీరోయిన్‌కు ప్రేక్షకాదరణ ఉన్నంత మాత్రాన కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉండరు. ఆ మార్కెట్‌కు తగ్గ రికవరీ, ఓటీటీ వాల్యూ, శాటిలైట్ బిజినెస్, విదేశీ మార్కెట్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్స్ స్టేజ్‌లోనే ఆగిపోవడం కొత్త విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మృణాల్ విషయంలో కూడా ఇదే అంశం డిస్కషన్ కు వస్తోంది. హీరోయిన్ గా ఆమెకు మంచి పేరు ఉన్నా, కమర్షియల్ మార్కెట్ పరంగా నిర్మాతలు ఎంత వరకు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారన్నదే కీలకంగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యం, అందుకు కేటాయించే బడ్జెట్, కాల్షీట్స్ వంటి అంశాలు కూడా రెమ్యునరేషన్ డిస్కషన్స్ ను ప్రభావితం చేస్తాయి.
అంతేకాదు, పెద్ద హీరోల సినిమాలు వరుసగా చేయకపోతే హీరోయిన్ మార్కెట్ వేగంగా విస్తరించదు. అదే సమయంలో మార్కెట్ పెరగాలంటే భారీ ప్రాజెక్టులు అవసరం. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం చాలా మంది హీరోయిన్లకు సవాలుగా మారుతోంది. అయితే రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగడం తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు. నటిగా తన వాల్యూను కాపాడుకోవడం, సరైన ప్రాజెక్టులను ఎంచుకోవడం, కెరీర్‌ను దీర్ఘకాలికంగా నిర్మించుకోవడం కూడా ఒక వ్యూహమే. కానీ ఆ వ్యూహం మార్కెట్ వాస్తవాలకు ఎంత వరకు సరిపోతుందన్నదే చివరికి అవకాశాల సంఖ్యను డిసైడ్ చేస్తుంది.