సూప‌ర్ స్టార్ ప్రాజెక్ట్‌కు ఏమైంది? వరుస మార్పులతో హైప్‌కు బ్రేక్!

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ నటిస్తున్న తలైవర్173 ప్రాజెక్ట్ చుట్టూ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.;

Update: 2026-04-23 13:28 GMT

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ నటిస్తున్న తలైవర్173 ప్రాజెక్ట్ చుట్టూ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మొదట భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు వరుస ట్విస్టులతో అనిశ్చితిలోకి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ విషయంలో వస్తున్న మార్పులు ప్రాజెక్ట్‌పై నెగెటివ్ సిగ్నల్స్ ను పంపిస్తున్నాయి. మొదట డైరెక్ట‌ర్ గా సుంద‌ర్. సి పేరు వినిపించగా, తర్వాత శిబి చ‌క్ర‌వ‌ర్తి రంగంలోకి వచ్చారు. ఇక తాజాగా అశ్వ‌త్ మారిముత్తు పేరు వినిపించడం మరో పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఈ తరహా బ్యాక్ టు బ్యాక్ మార్పులు ప్రాజెక్ట్ స్టెబిలిటీపై సందేహాలు పెంచుతున్నాయి.

అయితే ఈ గందరగోళం మధ్య ఒక పాజిటివ్ యాంగిల్ కూడా వినిపిస్తోంది. చివరికి శిబి చ‌క్ర‌వ‌ర్తి చెప్పిన కథ రజినీకాంత్‌కు నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త‌లైవర్ ఫైనల్ డెసిషన్ అంటూ ఈ వార్తను కొందరు పాజిటివ్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, ప్రాజెక్ట్‌కు ఒక క్లారిటీ వచ్చినట్లే. కానీ అధికారిక ప్రకటన రాకపోవడం వల్ల ఈ సమాచారం కూడా కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతోంది.

ఇక ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. తరచూ వస్తున్న లీక్స్, డైరెక్టర్ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల మార్కెట్‌లో హైప్ తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా రజినీకాంత్ సినిమా అంటే భారీ బజ్ ఉండటం సహజం. కానీ ఇలాంటి నెగెటివ్ న్యూస్ సైకిల్ కొనసాగితే, ప్రీ రిలీజ్ బిజినెస్‌పై కూడా ప్రభావం పడే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫ్యాన్స్ కోణంలో చూస్తే, పరిస్థితి ఇంకా కన్ఫ్యూజింగ్‌గా మారింది. అసలు ఈ సినిమాకు డైరెక్టర్ ఎవర‌నే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక్కో రోజు ఒక్కో పేరు వినిపించడం అభిమానుల్లో అనుమానాలు పెంచుతోంది. దీంతో ఈ విష‌యంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంద‌నే ప్ర‌శ్న‌తో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

డైరెక్టర్ మార్పులు ప్రాజెక్ట్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఆలస్యం జరిగిందనే టాక్ వినిపిస్తుండగా, షూటింగ్ స్టార్ట్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ప్రభావం రిలీజ్ ప్లాన్‌పై పడితే, మేకర్స్ మొదట అనుకున్న టైమ్‌లైన్ పూర్తిగా మారిపోవచ్చు. ఇక మేకర్స్ వైపు నుంచి వస్తున్న మౌనం కూడా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇంతటి పెద్ద ప్రాజెక్ట్‌పై అధికారిక క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండటం వెనుక కారణాలేమిటి అన్నది చర్చనీయాంశమైంది. ఇది ఒక ప్లాన్డ్ స్ట్రాటజీనా? లేక ప్రాజెక్ట్‌లో నిజంగానే సమస్యలున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే, తలైవర్173 ప్రాజెక్టు ప్రస్తుతం గందరగోళ దశలో ఉందని చెప్పాలి. క్లారిటీ లేని పరిస్థితి కొనసాగితే ప్రాజెక్ట్ ఇమేజ్‌పై ఎఫెక్ట్ ప‌డే ఛాన్సుంది. వీలైనంత త్వ‌ర‌గా మేక‌ర్స్ అధికారిక ప్రకటనతో ఈ సందేహాలకు తెరదించాలని అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News