రెండున్నర ఏళ్ల ఎదురు చూపులు... హిట్ కొట్టేనా?
ఈ యాక్షన్ డ్రామా మూవీ టీజర్, పాటలు పూర్తిగా ఫ్యామిలీ కథను తలపిస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.;
స్టార్ హీరోయిన్ సమంత పెద్ద బ్రేక్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. 2023లో చివరగా సమంత 'ఖుషి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ పలు కారణాల అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల సమంత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. మధ్యలో వెబ్ సిరీస్‌తో వచ్చినప్పటికీ అభిమానులు సామ్ సినిమా ఎప్పుడు అంటూ దాదాపు రెండున్నర ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. మధ్యలో సమంత నిర్మాణంలో శుభం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో గెస్ట్ రోల్‌లో సమంత కనిపించింది. ఆ తర్వాత సమంత నటిగా ఇన్నాళ్లకు 'మా ఇంటి బంగారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు నిర్మాణ పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సమంత హీరోయిన్‌గా వరుస...
కెరీర్ ఆరంభంలో కమర్షియల్ పాత్రలు చేసిన సమంత హీరోలకు జోడీగా నటించి, వారితో స్టెప్‌లు వేస్తూ వచ్చింది. కానీ గత కొంత కాలంగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం ఈమె చేస్తోంది. మా ఇంటి బంగారం సినిమా సైతం కాస్త అటు ఇటుగా లేడీ ఓరియంటెడ్ మూవీ అని ప్రచారం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల లేట్ అయినప్పటికీ మంచి టైమ్‌లో రిలీజ్‌కి సిద్ధం అయింది. సమంత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో విడుదల కాబోతున్న సినిమా కావడంతో గత చిత్రాల కంటే ఈ సినిమాను సామ్ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అంటూ ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో సమంత పాటలతో, వీడియోలతో తెగ వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.
చీర కట్టులో సమంత కొత్త లుక్...
ఈ యాక్షన్ డ్రామా మూవీ టీజర్, పాటలు పూర్తిగా ఫ్యామిలీ కథను తలపిస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతకు సమంత పాత్ర ఏంటి, ఆ ఫ్యామిలీ తో సమంత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు. సమంతను నిండైన చీర కట్టులో ఈ సినిమాలో చూడబోతున్నాం. సమంత సాదారణంగా చీర కట్టులో చాలా బాగుంటుంది అనే టాక్ ఉంది. ఆమెను చాలా మంది చీర కట్టులో అభిమానిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో ఆమె ఎక్కువ చీర కట్టు ఫోటోలో కనిపించబోతున్న ట్లు సమాచారం అందుతోంది. సమంతకు ఈ సినిమా అత్యంత కీలకం. టాలీవుడ్‌లో సమంత గురించి ఎదురు చూస్తున్న వారు ఈ సినిమా హిట్ కోసం బలంగా కోరుకుంటున్నారు. సమంత టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలంటే ఈ సినిమా హిట్ కావాల్సిందే.
మా ఇంటి బంగారం మూవీతో...
వివాహ బంధం బ్రేక్ కావడంతో సమంత కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది, అదే సమయంలో అనారోగ్య సమస్యల కారణంగా సమంత చాలా కృంగిపోయింది. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో పడింది. ఇటీవల ఆయన్ను వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని సమంత ప్రారంభించింది. వ్యక్తిగత జీవితం గాడిన పడటంతో ఫిల్మ్ కెరీర్ పై సమంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండున్నర ఏళ్లుగా సమంత సినిమా కోసం ఎదురు చూసిన వారు మా ఇంటి బంగారం సినిమా హిట్ అవుతుంది అనే విశ్వాసం వ్యకత్ం చేస్తున్నారు. నందిని రెడ్డి, సమంత కాంబోలో గతంలో వచ్చిన సినిమాల ఫలితంను బట్టి చూసినా మా ఇంటి బంగారం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విషయం ను చాలా మంది ధీమాతో చెబుతున్నారు. మే 15, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.