మహేష్-కొరటాల.. రిలీజ్ డేట్ ఇచ్చేశారోచ్
‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ బాబు-కొరటాల శివ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు కొరటాల. నిన్ననే ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ రోజు ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా సమాచారం వచ్చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబరు 22న మహేష్-కొరటాల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందట.
ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ సినిమా కోసం నిర్విరామంగా పని చేస్తున్నాడు. ఆ చిత్రం జనవరిలో పూర్తవుతుంది. జనవరి 1న ఫస్ట్ లుక్.. టైటిల్ రివీల్ చేస్తారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న వస్తుందంటున్నారు. అంటే మరో ఐదు నెలలకే మహేష్ సినిమా ఇంకోటి ప్రేక్షకుల్ని పలకరిస్తుందన్నమాట. కాబట్టి ప్రిన్స్ అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఈ రెండు సినిమాల మీదా అంచనాలు భారీగానే ఉన్నాయి. కొరటాల సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తాడని అంటున్నారు. ‘శ్రీమంతుడు’ తరహాలోనే మరో ఉదాత్తమైన కథాంశాన్ని మహేష్ కోసం రెడీ చేశాడట కొరటాల. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నాడు. కీర్తి సురేష్ ఇందులో కథానాయిక అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/