'టాక్సిక్' తెలుగు ట్రైలర్ విధ్వంసం: హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో రాకింగ్ స్టార్ దండయాత్ర!
ఈ ట్రైలర్‌లో రాకింగ్ స్టార్ యష్ `రాయా` & రూమి (టికెట్) అనే ద్విపాత్రాభినయంలో తండ్రీకొడుకులుగా కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` అధికారిక తెలుగు ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్-1 స్థానంలో నిలిచింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ సౌత్ సంయుక్తంగా విడుదల చేసిన ఈ 4 నిమిషాల 38 సెకన్ల విజువల్ వండర్.. శనివారం బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సునామీ సృష్టిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల నుంచి .. సినీ విశ్లేషకుల నుంచి ఈ ట్రైలర్‌కు భారీ స్పందన లభిస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్.. టెక్నికల్ క్వాలిటీ విషయంలో భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నేషనల్ అవార్డు విన్నర్ రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, `జాన్ విక్` ఫేమ్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జె.జె. పెర్రీ అందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న విజువల్స్, డార్క్ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్ .. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.
ఈ ట్రైలర్‌లో రాకింగ్ స్టార్ యష్ `రాయా` & రూమి (టికెట్) అనే ద్విపాత్రాభినయంలో తండ్రీకొడుకులుగా కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. రోమాన్స్, డార్క్ ఎమోషన్స్.. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఘర్షణ వాతావరణం కథలోని గాఢతను చాటిచెబుతున్నాయి. ది వరల్డ్ ఈజ్ మై టెరిటరీ.. డాడీస్ హోమ్.. వంటి పవర్‌ఫుల్ లైన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. యష్‌లోని రా అండ్ రస్టిక్ యాక్టింగ్ అండ్ మేకోవర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది.
సినిమాలోని లేడీ పవర్ కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వాణీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి అగ్ర కథానాయికలు క్లిష్టమైన- బలమైన పాత్రల్లో దర్శనమిచ్చారు. సాధారణ గ్యాంగ్‌స్టర్ కథలా కాకుండా సైకలాజికల్ డెప్త్, నమ్మకద్రోహం -ప్రతీకారం చుట్టూ తిరిగే ఒక కాంప్లెక్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ కట్ చూస్తే స్పష్టమవుతోంది.
రూమర్లన్నీ పటాపంచలు చేస్తూ.. దాదాపు 200 రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ విజువల్ వండర్ 26 ఆగస్ట్ , 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కన్నడ - ఇంగ్లీష్ భాషల్లో నేరుగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఇచ్చిన మాస్ హైప్‌తో థియేటర్లలో `టాక్సిక్` సృష్టించబోయే బాక్సాఫీస్ విధ్వంసం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.