కృష్ణ‌గాడు ఆ రికార్డు బ‌ద్ద‌లుకొట్టేశాడు

Update: 2016-02-16 16:46 GMT
సినిమా సినిమాకు రేంజి పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. గ‌త ఏడాది ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’తో అత‌ను సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. దాదాపు రూ.50 కోట్ల దాకా గ్రాస్‌.. 30 కోట్ల దాకా షేర్.. అమెరికాలో 1.5 మిలియ‌న్ డాల‌ర్లు క‌లెక్ట్ చేసి టాలీవుడ్ కు పెద్ద షాకిచ్చాడు నాని. ఇప్పుడిక త‌న కొత్త సినిమా ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌’తోనూ వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సాగిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్లోనే రూ.10 కోట్ల దాకా క‌లెక్ట్ చేసిన‌ట్లు అంచ‌నా వేస్త‌న్నారు. ఫుల్ ర‌న్లో ఈ సినిమా ఎంత క‌లెక్ట్ చేస్తుందో కానీ.. శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో మాత్రం రికార్డు ధ‌ర ప‌లికింది.

నాని సినిమాల్లోనే అత్య‌ధికంగా రూ.4.2 కోట్ల‌కు ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌’ను సొంతం చేస‌కుంది మా టీవీ.ఇంత‌కుముందు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాను కూడా మాటీవీనే రూ.3.8 కోట్ల‌కు కొనుక్కుంది. ఆ ధ‌ర బాగానే గిట్టుబాట‌వ‌డం.. ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ ప్రిమియ‌ర్ షోకు మంచి రెస్పాన్స్ రావ‌డంతో నాని కొత్త సినిమాకు మ‌రింత ఎక్కువ రేటు పెట్టింది ఆ ఛానెల్‌.రూ.10 కోట్ల బ‌డ్జెట్ తో సినిమా తీసి.. ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల హక్కుల్నే రూ.15 కోట్ల‌కు అమ్మిన 14 రీల్స్ సంస్థ‌.. యుఎస్ రైట్స్ త‌మ ద‌గ్గరే పెట్టుకుంది. ఆ వ‌సూళ్ల‌కు తోడు శాటిలైట్ ద్వారా వ‌చ్చిన ఆదాయ‌మంతా కూడా 14 రీల్స్ ఖాతాలోకే వెళ్ల‌బోతోంది. మొత్తానికి చిన్న సినిమాతో భారీగా లాభాలు అందుకుంటోంది ఈ సంస్థ‌.
Tags:    

Similar News