ఈ 2 రోజులు చాలా స్పెషల్..

అందుకే నా ఫ్రెండ్స్ తో కలిసి గడపడానికి శ్రీలంకకు వెళ్లాను. ఇక్కడ ఈ అందమైన ప్రదేశాలు మమ్మల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. మా బెస్ట్ ఫ్రెండ్స్ లో కొంతమంది ఈ వెకేషన్ మిస్ అయ్యారు.;

Update: 2025-12-17 04:36 GMT

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ తీరిక లేకుండా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. అందుకే కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లి మైండ్ రీఫ్రెష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న రష్మిక మందన్న తాజాగా తన స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. ముఖ్యంగా వర్షా బొల్లమ్మ, రష్మిక మందన్న అలాగే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి శ్రీలంకకి వెళ్లారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది రష్మిక మందన్న.

 

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడమే కాకుండా.. ఇటీవల నాకు రెండు రోజుల సెలవు లభించింది. అందుకే నా ఫ్రెండ్స్ తో కలిసి గడపడానికి శ్రీలంకకు వెళ్లాను. ఇక్కడ ఈ అందమైన ప్రదేశాలు మమ్మల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. మా బెస్ట్ ఫ్రెండ్స్ లో కొంతమంది ఈ వెకేషన్ మిస్ అయ్యారు. కానీ ఈ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఈ రెండు రోజులు చాలా ప్రత్యేకం గా అనిపించింది" అంటూ రష్మిక క్యాప్షన్ లో తెలిపింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫోటోలు అలాగే ఇచ్చిన క్యాప్షన్ రెండూ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

 

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. కన్నడ బ్యూటీ అయిన రష్మిక.. అక్కడే పలు యాడ్స్, చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

 

ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని బిజీగా మారిపోయింది రష్మిక మందన్న. ముఖ్యంగా సుకుమార్ - అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా అవతరించింది.

 

పుష్ప2 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న ఛావా, కుబేర, థామా, యానిమల్, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఊహించని క్రేజ్ అందించిందని చెప్పవచ్చు.. ఇందులో తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా యువతకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది రష్మిక. ఇక ప్రస్తుతం మైసా, రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది.

 

అటు రష్మిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఎంగేజ్మెంట్ పై రష్మిక ఓపెన్ అయింది కానీ విజయ్ దేవరకొండ స్పందించకపోవడం గమనార్హం.అటు విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.

Tags:    

Similar News