ఆ హిట్ వెబ్‌సిరీస్‌కు ఏ మాత్రం తగ్గకుండానే సినిమా
తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రివీల్ చేశారు. మీర్జాపూర్ ది ఫిల్మ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్టు మేకర్స్ వెల్లడించారు.;
వెబ్ సిరీస్‌లు గురించి అవగాహన ఉన్న వారికి మీర్జాపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఎంతోమంది ఆడియన్స్ ను అలరించడంలో సక్సెస్ అయింది. కోవిడ్ టైమ్ లో రిలీజైన ఈ సిరీస్ ఓటీటీలో ఎన్నో రికార్డులను సృష్టించిందని చెప్పొచ్చు. మీర్జాపూర్ రిలీజైన టైమ్ లో అందరూ దీని గురించి డిస్కస్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
మీర్జాపూర్ సిరీస్ కు మంచి క్రేజ్
ఈ సక్సెస్‌ఫుల్ సిరీస్ నుంచి మూడు సీజన్లు రాగా, మూడు సీజన్లకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మీర్జాపూర్ సక్సెస్ అవడంతో తర్వాత మీర్జాపూర్2, మీర్జాపూర్3 సీజన్లు తీయగా, అవి కూడా ఆడియన్స్ ను బాగానే మెప్పించాయి. అయితే ఇప్పుడీ సూపర్‌హిట్ సిరీస్ ను థియేటర్లలోకి తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీర్జాపూర్: ది ఫిల్మ్ అనే టైటిల్‌తో..
ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ సిరీస్ గా రిలీజైన ఈ ఫ్రాంచైజ్, ఇప్పుడు సినిమాగా రాబోతుంది. మీర్జాపూర్ ది ఫిల్మ్ పేరుతో దీన్ని సినిమాగా రూపొందిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రివీల్ చేశారు. మీర్జాపూర్ ది ఫిల్మ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్టు మేకర్స్ వెల్లడించారు.
మీర్జాపూర్ సినిమా షూటింగ్ పూర్తి
షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్ ది ఫిల్మ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నామని తెలిపారు. అయితే మీర్జాపూర్ వెబ్‌సిరీస్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కంటెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా చెప్తోంది. ఆరు నెలల్లోనే చిత్ర షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి సినిమాను రిలీజ్ కు రెడీ చేయడం చూస్తుంటే ఈ ప్రాజెక్టు విషయంలో టీమ్ ఎంత ఫాస్ట్ గా ఉందో అర్థమవుతుంది.
వెబ్‌సిరీస్ కు ప్రీక్వెల్ గా మీర్జాపూర్ ది ఫిల్మ్
మీర్జాపూర్ వెబ్‌సిరీస్ కు దర్శకత్వం వహించిన గుర్మీత్ సింగ్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తుండగా, పునీత్ కృష్ణ కథను అందిస్తున్నారు. వెబ్‌సిరీస్ కు ప్రీక్వెల్ గా ఈ మూవీ ఉంటుందని గతంలో చెప్పిన చిత్ర యూనిట్, సిరీస్ లో చనిపోయిన వారందరూ కూడా సినిమాలో కనిపించనున్నారని వెల్లడించింది. మరి ఓటీటీలో ఎంతో సెన్సేషన్ సృష్టించిన మీర్జాపూర్, వెండితెరపై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.