బుట్ట‌బొమ్మ మెల్లిగా బిజీ అవుతుందిగా!

తెలుగు ఆడియ‌న్స్ కు పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. బుట్ట‌బొమ్మ‌గా గుర్తుండిపోయిన పూజా హెగ్డే గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-02-02 18:30 GMT

తెలుగు ఆడియ‌న్స్ కు పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. బుట్ట‌బొమ్మ‌గా గుర్తుండిపోయిన పూజా హెగ్డే గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. అల వైకుంఠ‌పుర‌ములో మూవీ త‌ర్వాత తెలుగులో పూజాకి చెప్పుకోద‌గ్గ సినిమా ఒక్క‌టి కూడా ప‌డ‌లేదు. ఆ సినిమాతో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన పూజా త‌ర్వాత చేసిన సినిమాలు అనుకున్న ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయాయి.

రాధేశ్యామ్ త‌ర్వాత తెలుగులో త‌గ్గిన అవ‌కాశాలు

ఆచార్య లాంటి మెగా మూవీలో న‌టించిన‌ప్ప‌టికీ ఆ సినిమా డిజాస్ట‌ర్ గా మిగిలింది. మ‌రీ ముఖ్యంగా రాధే శ్యామ్ త‌ర్వాత పూజాకు తెలుగులో ఆఫ‌ర్లు బాగా త‌గ్గిపోయాయి. దీంతో పూజా త‌న ఫోక‌స్ ను వేరే భాష‌ల‌పై పెట్టారు. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోల‌తో క‌లిసి సినిమాలు చేసే అవ‌కాశాల్ని అయితే అందుకోగ‌లిగినా, అవి కూడా ఆమెకు నిరాశ‌నే మిగిల్చాయి.

డిజాస్ట‌ర్ గా నిలిచిన రెట్రో

అయిన‌ప్ప‌టికీ గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో పూజా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాల డిస్క‌ష‌న్స్ లో పూజా పేరు వినిపిస్తూనే వ‌స్తుంది. బాలీవుడ్ లో క‌లిసిరాక‌పోయినా కోలీవుడ్ లో అయినా బుట్ట‌బొమ్మ‌కు క‌లిసొస్తుందంటే అక్క‌డ కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ‌లేదు. ఎన్నో అంచ‌నాల‌తో చేసిన రెట్రో మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక చ‌తికిలప‌డింది.

కోలీవుడ్ లో పూజాకి స్టార్ల స‌ర‌స‌న ఛాన్సుల‌

రెట్రో ఫ్లాపైనా పూజాకు కోలీవుడ్ లో ఆఫ‌ర్లకేమీ కొదువ లేదు. కూలీ సినిమాలో మోనికా అనే స్పెష‌ల్ సాంగ్ తో సూప‌ర్ క్రేజ్ ను తెచ్చుకున్న పూజా హెగ్డే చేతిలో జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కు రెడీగా ఉంది. అది కాకుండా కాంచ‌న‌4లో కూడా పూజా న‌టిస్తున్నారు. ఓ వైపు త‌మిళంలో వ‌రుస ప్రాజెక్టుల‌ను లైన్ లో పెడుతూనే టాలీవుడ్ పై కూడా ఫోక‌స్ చేశారు పూజా. అందులో భాగంగానే పూజా ఆల్రెడీ దుల్క‌ర్ స‌ర‌స‌న ఓ క్రేజీ ప్రాజెక్టులో భాగ‌మ‌వ‌గా, ఇప్పుడు అమ్మ‌డి చేతికి మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది.

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఆ ప్రాజెక్టులో హీరోయిన్ గా పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం ది ప్యార‌డైజ్ సినిమాలో బిజీగా ఉన్న నాని, త్వ‌ర‌లోనే ఆ సినిమాను పూర్తి చేసి, జూన్ లో రిలీజ్ కు రెడీ చేయాల‌ని చూస్తున్నారు. ది ప్యార‌డైజ్ రిలీజైన వెంట‌నే జూన్ ఆఖ‌ర్లో లేదా జులై ఫ‌స్ట్ వీక్ లోనే నాని- సుజీత్ మూవీకి సంబంధించిన షూటింగ్ మొద‌ల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే నాని త‌న సినిమాల్లో స్టార్ హీరోయిన్ల‌నే తీసుకోవాల‌ని ప‌ర్టిక్యులర్ గా ఎప్పుడూ ఉండ‌రు. క‌థ‌కు స‌రిపోయే హీరోయిన్లైతే చాల‌నుకునే నాని త‌న కెరీర్లో స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేసింది త‌క్కువ‌నే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ మ‌రియు గ్లామ‌ర‌స్ భామ‌ అయిన పూజాతో సినిమా చేస్తుంద‌ని తెలియ‌డంతో ఈ కాంబినేష‌న్ ఎలా ఉంటుందా అని అప్పుడే ఈ మూవీపై బ‌జ్ క్రియేట్ అయింది. మ‌రి ఆన్‌స్క్రీన్ పై వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి మొన్న‌టివ‌ర‌కు తెలుగులో అస‌లు అవ‌కాశాలే లేని పూజా మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల‌తో బిజీ అవ‌డం ఆమె ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్నిస్తుంది.

Tags:    

Similar News