పబ్లిక్ లో అలాంటి పని చేసిన జాన్వీ.. ఫోటో వైరల్

అతిలోక సుందరి అందాల తార దివంగత నటీమణి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్.;

Update: 2026-02-02 23:30 GMT

అతిలోక సుందరి అందాల తార దివంగత నటీమణి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. తల్లికి తగ్గ అందంతో అద్భుతమైన నటనతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో టాలీవుడ్ సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అలా తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా వచ్చిన దేవర సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది .ముఖ్యంగా శ్రీదేవి చివరి కోరిక కూడా ఇదే కావడం గమనార్హం.



 


ఒకసారి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. శ్రీదేవి తన కూతుర్ని నా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కలలు కన్నారు. ఎందుకంటే ఆమె మా తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారితో ఎన్నో సినిమాలు చేశారు. అందుకే ఆయన మనవడైన నాతో ఆమె కూతురి తెలుగు ఎంట్రీ కావాలని కోరుకున్నారు అంటూ శ్రీదేవి మాటగా ఎన్టీఆర్ గతంలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.



 


అందుకు తగ్గట్టుగానే శ్రీదేవి కోరిక మేరకు జాన్వీ కపూర్ కూడా తన తొలి తెలుగు చిత్రాన్ని స్వర్గీయులు ఎన్టీఆర్ వారసులైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి అమ్మ కలను నెరవేర్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనల కారణంగా దసరాకి వాయిదా పడుతున్నట్లు సమాచారం.



 


ముఖ్యంగా సినిమా టికెట్ ధరలను పెంచాలి అంటే మూడు నెలల ముందు అనుమతి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ సినిమాను మరో మూడు నెలలు వాయిదా వేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోసే ఈ ముద్దుగుమ్మ.. ఈసారి పబ్లిక్ లో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా మినీ స్కర్ట్ లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ ధరించిన ఈమె తన అందాలను పబ్లిక్ లో చూపెడుతూ లిఫ్ట్లో సెల్ఫీ ఫోటోలు దిగే ప్రయత్నం చేసింది . అయితే అందులో ఉన్న మిగతా వారు జాన్వి ఫోటోలు తీసుకుంటుండగా ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నట్టు జాన్వీ షేర్ చేసిన ఫోటోలలో కనిపిస్తోంది.

మొత్తానికైతే ఇది చూసిన కొంతమంది పబ్లిక్ లో ఇలా సెల్ఫీ ఫోటోలతో రెచ్చిపోతుంది అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంత మంది పబ్లిక్ లోకి వచ్చాక కాస్త డీసెంట్గా ఉండడానికి ట్రై చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా జాన్వీ కపూర్ మినీ స్కర్ట్ అందాలు మాత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News