రీల్ పైనా కాదు..రియల్ గానూ సమంత బంగారమే!
ఇది చూసిన అభిమానులు సామ్ నిజ జీవితంలోనూ `బంగారమే` అని కొనియాడుతున్నారు.
వెండితెరపై ప్రేక్షకులను అలరించడంమే కాదు. నిజజీవితంలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ సమంత అగ్రస్థానంలో నిలుస్తుంది. సినిమాల్లోనే కాదు. సామాజిక సేవలోనూ సామ్ ఎప్పుడూ ముందుంటుంది. బయటి వ్యక్తులకే కాకుండా తన చుట్టూ ఉండే తోటి సిబ్బందిని .. అసిస్టెంట్లను సమంత ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో చెప్పడానికి ఇటీవల జరిగిన సంఘటనే నిదర్శనం. ఇది చూసిన అభిమానులు సామ్ నిజ జీవితంలోనూ `బంగారమే` అని కొనియాడుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ సినిమా సక్సెస్ మీట్ వేదికపై సమంత పర్సనల్ అసిస్టెంట్ ఆర్యన్ మాట్లాడిన మాటలు, అతను కన్నీటి పర్యంతమైన విధానం అందరి హృదయాలను కదిలించింది. తన కష్టసుఖాల్లో సమంత తనకు ఎలా అండగా నిలిచిందో? ఒక యజమానిలా కాకుండా కుటుంబ సభ్యురాలిగా ఎలా ఆదరించిందో? చెప్తుంటే ఆర్యన్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. వేదికపై తన అసిస్టెంట్ అంతలా ఏడుస్తూ మాట్లాడుతుంటే కింద కూర్చున్న సమంత సైతం కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల వద్ద పనిచేసే సిబ్బందికి వృత్తిపరమైన సంబంధాలే ఉంటాయి. కానీ సమంత అసిస్టెంట్లను, మేనేజర్లను సొంత మనుషులుగా భావిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తనే స్వయంగా చొరవ తీసుకుని ఆదుకుంటుంది. ఒక సెలబ్రిటీ ఇంత గొప్పగా సహాయపడకపోతే వారి వ్యక్తిగత సిబ్బంది బహిరంగ వేదికలపై అంతగా కన్నీటి పర్యంతం కారు. ఆర్యన్ కళ్లలో వచ్చిన ఆ కన్నీళ్లే సమంత నిష్కల్మషమైన మనసుకు, గొప్ప వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి.
నేటి తరం హీరోయిన్లలో సమంత శైలి పూర్తి భిన్నం. స్టార్‌డమ్ తలకెక్కి ప్రవర్తించే ఈ రోజుల్లో? ఎంతో ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆమె సొంతం. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఆర్థిక సాయం చేస్తూ ఇప్పటికే రియల్ హీరో అనిపించుకున్న సమంత తన రోజువారీ జీవితంలో భాగమైన అసిస్టెంట్ల పట్ల కూడా అంతే కరుణతో వ్యవహరించడం విశేషం. డబ్బు ఇవ్వడం కంటే మనసు ఇవ్వడం, తోటి మనుషులను గౌరవించడం ఆమెకు తెలుసని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.
ఒక నటిగా సమంత సాధించిన విజయాలు ఎన్నో ఉండొచ్చు. కానీ మంచి మనిషిగా ఆమె సంపాదించుకున్న అభిమానం వాటన్నింటికంటే ఎంతో మిన్న. రీల్ లైఫ్ లో ఎలాంటి పాత్రనైనా పండించే సమంత, రియల్ లైఫ్ లో మాత్రం స్వచ్ఛమైన మనసున్న సాధారణ వ్యక్తిలా జీవిస్తుంది. తన సిబ్బంది కష్టాన్ని గుర్తించి, వారిని గౌరవించే ఇలాంటి నటీమణులు పరిశ్రమకు ఎంతో అవసరం. ఆర్యన్ ఎమోషనల్ స్పీచ్, సమంత స్పందించిన తీరు చూసిన తర్వాత ఎవరైనా సరే.. సమంత నిజంగా బంగారమే అనకుండా ఉండలేరు.