పాత తరం హీరోయిన్లను మరిపించిన త్రిష!
దశాబ్దం పాటు స్టార్‌డమ్‌ను కాపాడుకోవడమే గొప్ప విషయంగా భావించే ఈ రోజుల్లో ఏకంగా 27 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానంలో కొనసాగడం అద్భుతం.
సాధారణంగా పరిశ్రమలో కథానాయికల కెరీర్ వ్యవధి చాలా పరిమితంగా ఉంటుంది. దశాబ్దం పాటు స్టార్‌డమ్‌ను కాపాడుకోవడమే గొప్ప విషయంగా భావించే ఈ రోజుల్లో ఏకంగా 27 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానంలో కొనసాగడం అద్భుతం. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి త్రిష కృష్ణన్ సాధించిన ఈ ఘనత పాత కాలపు మహానటీమణుల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తుచేస్తోంది. నాటి తరం కథానాయికలు దశాబ్దాల పాటు వెండితెరను ఎలాగైతే ఏలారో? త్రిష సైతం అదే రీతిలో నటనతో? చరిష్మాతో నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో కొత్త తరం నటీమణుల రాకతో పాతవారు వెనకబడిపోవడం సహజం. కానీ త్రిష విషయంలో ఈ సమీకరణాలు మారిపోయాయి. 1999వ సంవత్పరం ప్రారంభంలో కెరీర్ ప్రారంభించిన అమ్మడు నాటి స్టార్ హీరోల నుండి నేటి తరం యంగ్ హీరోల వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటూ దూసుకుపోతోంది. కాలం మారుతున్నా? ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నా? త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం వృత్తిపై ఉన్న అంకితభావాన్ని స్పష్టం చేస్తోంది. త్రిష సమకాలీనులైన నయనతార, అనుష్క శెట్టి వంటి అగ్ర నటీమణులు కూడా పరిశ్రమలో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
వారు కూడా సౌత్ సినిమాపై తమదైన ముద్ర వేసినా.. అనుష్క సినిమాల సంఖ్య తగ్గింది. నయనతార కూడా సెలక్టివ్ గానే వెళ్తోంది. వీరితో పోలిస్తే త్రిష 27 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నా? ఇప్పటికీ కమర్షియల్, పాన్-ఇండియా , భారీ బడ్జెట్ చిత్రాలలో బిజీగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో త్రిష తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటూ వచ్చింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది.
తదుపరి కాలంలో `96` , `పొన్నియిన్ సెల్వన్` వంటి చిత్రాలు కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాత్ర ఏదైనా ? అందులో లీనమైపోయే నైపుణ్యమే మూడు తరాల ప్రేక్షకులను ఆమెకు అభిమానులుగా మార్చింది. సావిత్రి, జమున, జయప్రద, శ్రీదేవి వంటి నటీమణులు మాత్రమే రెండు, మూడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నాయికలుగా వెలిగారు. ఆ తర్వాత కాలంలో కథానాయికల ప్రాధాన్యత.. కెరీర్ స్పాన్ తగ్గుతూ వచ్చిన తరుణంలో త్రిష మళ్లీ ఆ పాత తరం సెంటిమెంట్‌ను, సుదీర్ఘ వైభవాన్ని పునరావృతం చేస్తుంది.
నేటి గ్లామర్ ప్రపంచంలో ఒక నటి ఇంత కాలం పాటు టాప్ లీగ్‌లో కొనసాగడం అనేది అదృష్టం వల్ల సాధ్యం కాదు. అందుకు ఎనలేని కృషి, పట్టుదల ఎంతో అవసరం. ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను చూస్తే? జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అగ్ర దర్శకులు, పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికీ త్రిష డేట్స్ కోసం వేచి చూస్తుండటం విశేషం.