నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న దీప్తి సునయన!
ఈమె ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చి పడతాయి. అటు మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా.. చీర కట్టినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.
ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ.. ఊహించని పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన షార్ట్ ఫిలిమ్స్ కంటే కూడా మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం ఈమెకు మరింత పాపులారిటీని అందించి పెట్టింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్ల ఫేవరెట్ బ్యూటీ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈమె అందానికి ఫిదా అయిపోతున్నారు కుర్ర కారు.
ఈమె ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చి పడతాయి. అటు మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా.. చీర కట్టినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. నిజానికి ఒక్క సినిమా కూడా చేయకుండానే హీరోయిన్స్ ను మించిన క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది.
ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా అటు గ్లామర్ గా, ఇటు సాంప్రదాయంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించే దీప్తి సునయన తాజాగా మరోసారి నెటిజన్స్ ముందుకు వచ్చి కుర్రాళ్లను మాయ చేస్తోంది. గ్లామర్ వలకబోస్తూ నడుము వయ్యారాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు యువత కరిగిపోతున్నారు. తాజాగా చీర కట్టులో కనిపించిన ఈమె ఇందులో లేడీ ఫోటోగ్రాఫర్ గా మారిపోయిందని చెప్పాలి. ఇక దీప్తి సునయన డ్రెస్సింగ్ విషయానికి వస్తే.. ప్యూర్ హ్యాండ్లూమ్ యెల్లో కలర్ కాటన్ శారీ కట్టుకున్న ఈమె.. దీనికి బ్లూ కలర్ బార్డర్తో చీరను చక్కగా డిజైన్ చేశారు. ఇక ఈ బార్డర్ ను మ్యాచింగ్ చేస్తూ స్లీవ్ లెస్ బ్లూ కలర్ బ్లౌజ్ ధరించింది.
ఇక నడుము అందాలను హైలెట్ చేస్తూ బ్యాక్ నుండి దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ రేంజ్ లో ఇంత అందాన్ని ఒలకబోస్తున్న ఈమె ఎందుకు సినిమాలలో అవకాశాలను అందుకోవడం లేదు అనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.
దీప్తి సునయన విషయానికి వస్తే.. డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేసి మరింత వైరల్ అయింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పేరు దక్కించుకున్న దీప్తి.. రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకొని.. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాలలో అవకాశాలు అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అదేది జరగలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాతోనే బిజీగా ఉన్న ఈమె ఇలా తన అందచందాలను ఆరబోస్తూ.. కుర్రకారుకు మతిపోగొడుతోంది. ఏది ఏమైనా దీప్తి షేర్ చేసిన ఈ తాజా ఫోటోలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటున్నాయి.