టాప్ స్టోరి: సూప‌ర్‌స్టార్‌ని వేటాడుతున్న కృష్ణ‌జింక క‌థ‌

ఇప్పుడు ఈకేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్‌పై దాడులు జ‌రిపిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్టు తెలుస్తోంది.;

Update: 2026-02-02 18:35 GMT

అత‌డు ఇండ‌స్ట్రీని ఏల్తున్న‌ పెద్ద సూప‌ర్ స్టార్. ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌ను శాసిస్తున్నాడు. వివాదాల్లోను అత‌డు ఎప్పుడూ ముందుంటాడు. ఒక‌ప్పుడు మాజీ ప్ర‌పంచ సుంద‌రితో ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ కార‌ణంగా, తోటి హీరోల‌తో గొడ‌వ‌ల కార‌ణంగా నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చేవాడు. ఇటీవ‌ల అత‌డికి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అత‌డిని దారుణంగా తిట్టాడు. నానా బూ*లు తిట్టాడు. ఇండ‌స్ట్రీలో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాయ‌డంలోనే కాదు, నిరంత‌ర‌ వివాదాల్లోను ఈ స్టార్ హీరో రికార్డులు తిర‌గ‌రాసాడు. అంతేకాదు కృష్ణ జింక‌ను వేటాడి చంపిన కేసులో జైలుకు కూడా వెళ్లి వ‌చ్చాడు.

అయితే అత‌డు ఎన్ని త‌ప్పులు చేసినా అన్నిటికీ క్ష‌మాప‌ణ దొరికింది కానీ, బ‌య‌ట‌ప‌డగ‌లిగాడు కానీ.. ఒక్క‌ కృష్ణ జింక మాత్రం అత‌డిని విడిచిపెట్ట‌డం లేదు. అత‌డిని వెంటాడి వేటాడుతోంది. ఆ కృష్ణ జింక చ‌నిపోతూ ఏమ‌ని శ‌పించిందో కానీ, ఇప్ప‌టికీ దాని శాపం మూలాలు అల‌లు అలలుగా అత‌డిని చుట్టుముడుతూ, చుట్టూ తిరుగుతూ భ‌య‌పెడుతూనే ఉన్నాయి. అత‌డి కుటుంబాన్ని, బంధుమిత్రుల‌ను ఒక బొమ్మాళీలా భ‌య‌పెడుతోంది.

ఇప్ప‌టికే ఆ స్టార్ హీరో త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ఒక స్నేహితుడిని కూడా కోల్పోయాడు. ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు అయిన మిత్రుడిని గ్యాంగ్ స్ట‌ర్స్ తుపాకీతో కాల్చి దారుణంగా చంపారు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు అయిన‌ మ‌రో స్నేహితుడిని కూడా చంపేస్తామ‌ని బెదిరించారు. అచ్చంగా త‌న బాల్క‌నీపైకి ఎలా కాల్పులు జ‌రిపారో అదే విధంగా అత‌డి స్నేహితుడి ఇంటి పైకి కూడా కాల్పులు జ‌రిపి ఇదీ మా త‌డాఖా! అంటూ హెచ్చ‌రించారు. మేం త‌లుచుకుంటే ఎవ‌రినైనా లేపేస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

త‌మ ప‌నికి ప‌దే ప‌దే అడ్డు త‌గులుతున్నాడ‌ని, అలా అడ్డు త‌గిలితే వ‌దిలి పెట్ట‌బోమ‌ని, ఏదో ఒక రోజు చంపేస్తామ‌ని ఇప్పుడు స్టార్ హీరో స్నేహితుడైన పెద్ద డైరెక్ట‌ర్ కి వార్నింగ్ ఇవ్వ‌డం పోలీసుల‌కు సైతం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది. నిజం చెప్పాలంటే పోలీసుల‌కు కొన్నేళ్లుగా కంటి మీద కునుకు లేదు ఈ గ్యాంగ్ స్ట‌ర్ విష‌యంలో. ఎవ‌రు ఎన్ని చేసినా, ఇప్పుడు గ్యాంగ్ స్ట‌ర్ నుంచి వార్నింగ్ లు ఆగ‌డం లేదు. జైలు నుంచే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నాడు.

ఇప్పుడు ఈకేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్‌పై దాడులు జ‌రిపిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆ ఐదుగురి పేర్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ పోలీసులు వెల్ల‌డించ‌లేదు. ఇక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ఇంటిపై ఎటాక్ చేసింది మేమేనంటూ స‌ద‌రు స్టార్ హీరోని వెంటాడుతున్న గ్యాంగ్ స్ట‌ర్ బాహాటంగా ప్ర‌క‌టించాడు. ఇంత‌కుముందు స్టార్ హీరో ఇంటిపై దాడి చేసిన‌ప్పుడు ఇలాగే ప్ర‌క‌టించారు కూడా. ఈ ప‌ని మాదే.. మేమే ఎటాక్ చేసామ‌ని గ్యాంగ్ స్ట‌ర్ ప్ర‌క‌టించాడు. ఈ క‌రుడుగ‌ట్టిన‌ గ్యాంగ్ స్ట‌ర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎదురే లేని నెట్ వ‌ర్క్ ఉంది. ఒక పీఆర్వో కూడా ఉన్నాడు. ఈ పీఆర్వో క‌ర్కోట‌కుడు. ఎప్పుడూ మెయిల్స్ పంపుతూ అటు బాధితుడికి, ఇటు పోలీసుల‌కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నాడు. ఇప్పుడు కూడా మెయిల్ ద్వారా సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ కేసులో పోలీసులు వేగంగా పురోగ‌తి సాధించారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే నిందితుల‌ను అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన ఐదుగురి నుంచి ప్ర‌స్తుతం పోలీసులు నిజాలు కక్కించే ప‌నిలో ఉన్నారు. ఆ ఐదుగురు ఇచ్చే వాంగ్మూలాన్ని బ‌ట్టి త‌దుప‌రి విచార‌ణ జ‌రుగుతుంది.

అయితే ఈ క‌థ‌లో పెద్ద ట్విస్టేమిటంటే, ఆ గ్యాంగ్ స్ట‌ర్ జైలు నుంచే మొత్తం ఆప‌రేష‌న్లు చేప‌డుతున్నాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజులో 900 మంది షూట‌ర్ల‌తో ద‌డ పుట్టిస్తున్నాడు. స్టార్ హీరో స్నేహితుడు కం ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడిని చంపేసాక కూడా భ‌యం బెరుకు లేకుండా అత‌డు ప‌దే ప‌దే స్టార్ హీరోని, అత‌డి ఫ్యామిలీని, బంధువుల‌ను, మిత్రుల‌ను అంద‌రినీ చంపేస్తాన‌ని బెదిరిస్తున్నాడు. ప్ర‌స్తుతం వీళ్లెవ‌రికీ కంటిమీద కునుకైనా ప‌ట్ట‌డం లేదు. ఏ రోజుకారోజే ఉలిక్కి ప‌డుతున్నార‌ని పోలీసులు కూడా చెబుతున్నారు. వీళ్ల‌కు బందోబ‌స్తును మెయింటెయిన్ చేయ‌లేక పోలీస్ బాస్‌లు నానా హైరానా ప‌డుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ స‌ద‌రు స్టార్ హీరో త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకే వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడ‌న్న స‌మాచారం కూడా నిశ్చేష్ఠుల‌ను చేస్తోంది. అత‌డిని ర‌క్షించే క‌వ‌చం లాంటి బుల్టెట్ ప్రూఫ్ కార్ల కోస‌మే అత‌డు వంద కోట్లు ఖ‌ర్చు చేసాడ‌ని తెలుస్తోంది. ఈ క‌థ వింటుంటే ఒక సినిమా క‌థ‌ను మించి ఉంది. దీనిని సినిమాగా తీసేందుకు ఎవ‌రైనా ముందుకు వ‌స్తారేమో చూడాలి. ఈ క‌థ‌లో హీరో ఎవ‌రు? విల‌న్ ఎవ‌రు? స్నేహితుడు ఎవ‌రు? అన్న‌ది డియ‌ర్ రీడ‌ర్.. మీరే క‌నిపెట్టండి.. ఈ క‌థ మొత్తం మీకు తెలిసిన‌దే క‌దా!!

Tags:    

Similar News