అందాలతో కట్టిపడేస్తున్న రకుల్.. ఏం అందం బాబూ!

మొత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఈ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.;

Update: 2026-02-02 18:30 GMT

అందాలతో ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి సెలబ్రిటీలు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. ట్రెండీ ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా భిన్న విభిన్నమైన వస్త్రధారణలతో ప్రేక్షకులలో మరింత పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకోవడమే దిశగా అడుగులు వేస్తున్న హీరోయిన్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా తమ అందాలను ఆరబోస్తూ దర్శకుల కంట్లో పడుతున్నారు అనడంలో కూడా సందేహం లేదు. ఇదిలా ఉండగా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు

 

అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతూనే మరొకవైపు ఆ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అలాగే షూటింగ్ విశేషాలను పంచుకుంటూ సినిమాపై హైప్ పెంచుతూ ఉంటుంది. అలాగే తన భర్తతో కలిసి జిమ్ లో చేసే వర్కౌట్సుకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.అలాంటి ఈమె తాజాగా మరో ట్రెండీ ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఈమె ధరించిన ఈ అవుట్ ఫిట్ ఇది చీర కాదు కానీ చీర లాంటిది అనిపించేలా తన డ్రెస్ తో ఆకట్టుకుంది. పైన హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన జాకెట్ ధరించిన ఈమె కింద చీర కట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా తన అందాలతో అభిమానుల గుండెల్లో గుణపాలు దింపుతోంది అనడంలో సందేహం లేదు

 

మొత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఈ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఈమె అందాలు చూసిన అభిమానులు నీ అందాల సోయగానికి ముగ్ధులు అవుతున్నాం సఖి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ఇలాంటి అవుట్ ఫిట్స్ ఫ్యాషన్ ప్రియులకు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి అంటూ ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ఇలా వరుస కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తూ అమ్మడిపై వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో ప్రార్థన అనే పాత్ర పోషించి.. "ప్రార్థన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ" అనే ఒక డైలాగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి మరింత ఇమేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వచ్చేసిన ఈమె.. ఇక్కడ పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది..అలాగే బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీభగ్నానీ తో ఏడడుగులు వేసి బాలీవుడ్ లోనే సెటిలైపోయింది. ఇక అందులో భాగంగానే అక్కడే సినిమాలు చేస్తూ అలరిస్తోంది.

Tags:    

Similar News