నందు 'కాసు' గ్లింప్స్‌: డబ్బే మాన్స్టర్.. అసలు మిస్టరీ ఏంటి?

శ్రీ నందు, ఇందు కుమార్ జంటగా నటిస్తున్న మూవీనే కాసు. పి.ఎస్. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా గ్లింప్స్‌ ను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం విడుదల చేశారు.

Update: 2026-09-27 15:50 GMT

డబ్బు చుట్టూ తిరిగే కథలు చాలానే చూశాం. కానీ డబ్బునే ఓ మాన్స్టర్‌ గా చూపిస్తూ.. ప్రేమ, అత్యాశ, మిస్టరీని కలిపిన సినిమా వస్తే ఇంట్రెస్ట్ పెరగడం ఖాయం. ఇప్పుడు కాసు మూవీ గ్లింప్స్ కూడా ఇదే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. శ్రీ నందు, ఇందు కుమార్ జంటగా నటిస్తున్న మూవీనే కాసు. పి.ఎస్. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా గ్లింప్స్‌ ను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం విడుదల చేశారు.

గ్లింప్స్ చూస్తే ఇది కేవలం ప్రేమకథ కాదని మొదటి నుంచే క్లియర్ గా తెలుస్తోంది. ప్రతి సీన్ లో కూడా ఏదో తెలియని ప్రమాదం దాగి ఉన్న ఫీలింగ్ కనిపిస్తోంది. అయితే గ్లింప్స్‌ లో డబ్బు మెయిన్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. అయితే డబ్బు కోసం మనుషులు ఎంత దూరం వెళ్తారనే యాంగిల్ లో సినిమాలో స్టోరీ సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బంగారంతో చేసిన మాన్స్టర్ అనే డైలాగ్ హైప్ పెంచుతోంది.

బంగారంతో చేసిన మాన్స్టర్ అంటే ఏమిటి? డబ్బుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? అనే ప్రశ్నలు గ్లింప్స్‌ తో మొదలవుతున్నాయి. ఓ పురాతన నాణెం, దాచిన సంపద చుట్టూ కథలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ సంపద కోసం మొదలయ్యే అన్వేషణ ఎక్కడికి దారి తీస్తుంది అనేది సినిమాలో చూడాల్సిందే. గ్లింప్స్‌ లో మాత్రం కథ మొత్తాన్ని చెప్పకుండా కొన్ని ముక్కలు మాత్రమే చూపించారు. అదే ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

శ్రీ నందు కొత్త లుక్‌ తో కనిపించారు. గత సినిమాలతో పోలిస్తే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ లో ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ ఎన్విరాన్మెంట్ కు తగ్గట్టుగా ఆయన రోల్ ను డిజైన్ చేసినట్టు గ్లింప్స్ చూస్తే అనిపిస్తోంది. హీరోయిన్ ఇందు కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరి మధ్య ప్రేమకథ కూడా సినిమాలో ముఖ్యమైన భాగమే అయినా.. డబ్బు, అత్యాశ ఆ రిలేషన్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయనేది అసలు పాయింట్‌ గా కనిపిస్తోంది.

దీంతో ప్రేమకథకు కూడా థ్రిల్లర్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాసు గ్లింప్స్‌ లో విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. శ్యామ్ కె. నాయుడు కెమెరా వర్క్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ముఖ్యంగా డార్క్ తోనే, లొకేషన్స్, రోల్స్ ఎక్స్ప్రెషన్స్‌ తో గ్లింప్స్‌ కు స్పెషల్ మూడ్ వచ్చింది. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా గ్లింప్స్‌ లో స్ట్రాంగ్ గా వినిపించింది. సస్పెన్స్ పెరిగే కొద్దీ బీజీఎం కూడా ఇంటెన్స్‌ గా మారుతూ ఆసక్తిని పెంచుతోంది.

విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాలో కీలకంగా ఉండనున్నట్టు మూవీ టీమ్ చెబుతోంది. ప్రస్తుతానికి గ్లింప్స్‌ తో మూవీ స్టోరీపై ఇంట్రెస్ట్ పెంచిన మేకర్స్.. అసలు మిస్టరీని ట్రైలర్‌ లో ఎంతవరకు రివీల్ చేస్తారో చూడాలి. అయితే కాసు మూవీలో డబ్బు కేవలం అవసరం కాదు.. అదే కథలో అసలు మాన్స్టర్‌ గా మారినట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.


Full View


Tags:    

Similar News