• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగీరథ సినిమా నా లైఫ్ నే...

భగీరథ సినిమా నా లైఫ్ నే మార్చేసింది: ప్రొడ్యూసర్ నాయుడు

| "అనకాపల్లి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కాండ్రేగుల నాయుడు తన స్పీచ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు.

By - M Prashanth
Update: 2026-09-27 16:30 GMT

"అనకాపల్లి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కాండ్రేగుల నాయుడు తన స్పీచ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తు అయితే, తన లైఫ్ కు ఈ ఇండస్ట్రీ తో ఉన్న సంబంధం గురించి ఎమోషనల్ గా చెప్పారు. మొదట సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం అని, కానీ తమ మొదటి సినిమానే మైత్రీ మూవీ మేకర్స్, పూర్వి పిక్చర్స్ లాంటి పెద్ద బ్యానర్స్ ద్వారా రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

రోడ్డు మీద పడుకునే స్థాయి నుంచి వందల కోట్ల వ్యాపారం చేసే దాకా నా లైఫ్ ను మార్చేసింది ఒక సినిమానే అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రవితేజ హీరోగా వచ్చిన భగీరథ సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని నాయుడు పంచుకున్నారు. ఆ సినిమాను థియేటర్లలో రెండు వందల సార్లు చూశానని చెప్పారు. అందులో హీరోకి ఒక ఐదు లక్షల చెక్ ఇస్తారు, అలాగే దాడి వీరభద్రరావు గారి అబ్బాయి జగన్ ప్రభాకర్ కూడా తనకు ఐదు లక్షల చెక్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఆ క్షణమే తనలో ఒక వ్యాపారవేత్తను నిద్రలేపిందని, ఆ స్ఫూర్తితోనే రియల్ ఎస్టేట్ లోకి వచ్చానని ఆయన వివరించారు. చేతిలో రూపాయి అడ్వాన్స్ లేకపోయినా కేవలం తన మీద ఉన్న నమ్మకంతో అనకాపల్లి స్థానికులు భూములు ఇచ్చారని నాయుడు కృతజ్ఞతతో చెప్పారు. అలా మొదలైన తన ప్రయాణం నేషనల్ హైవే పక్కన ఐదొందల ఎకరాల లేఅవుట్ వేసే స్థాయికి చేరుకుందని ప్రకటించారు. తన ఎదుగుదలకు కారణమైన ఆ గడ్డ మీద ఉన్న ప్రేమతోనే తన వెంచర్ కు అనకాపల్లి అని పేరు పెట్టానని, ఇప్పుడు అదే పేరుతో సినిమా తీసి అందరి ముందు నిలబడటం ఆనందంగా ఉందని అన్నారు.

సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని సరిగ్గా రిలీజ్ చేయడం చాలా కష్టం అని నాయుడు అభిప్రాయపడ్డారు. త్రినాథరావు నక్కిన ఇచ్చిన అండతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని, కేవలం వ్యాపారంలో సక్సెస్ అయ్యాక ఒక ఐడెంటిటీ కోసమే ఈ సినిమాను నిర్మించానని ఆయన కుండబద్దలు కొట్టారు.

తన దగ్గర ఏమీ లేనప్పుడు నమ్మి ఆదరించిన అనకాపల్లి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని నాయుడు మాటిచ్చారు.

ఒక చిన్న సినిమా కథతో ప్రపంచానికి ఏదైనా చూపించగలమనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టామన్నారు. పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న అనకాపల్లి సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే, భవిష్యత్తులో ప్రేక్షకులను అలరించేలా మరో ఐదు సినిమాలు కచ్చితంగా తీస్తానని ఆయన వేదిక మీద ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. ఇక అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న రానుంది. ఆ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    
  • anakapalli 
  • kandregulanaidu 
  • anakapallimovie 
  • raviteja 
  • bhagiratha 
  • tollywood 
  • anakapalliprereleaseevent 

Similar News

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

'ఈగో రాజాస్' టీజర్: లోన్ యాప్స్ దందాలో ఆది సాయి కుమార్

2026-11-21 06:32 GMT

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

2026-11-21 06:32 GMT

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026-11-21 06:31 GMT

హీరో నుంచి కాపాడ‌మ‌ని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే ప‌రార్!

2026-11-21 06:29 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS