• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు మీనాక్షి -...

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

| అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12న విడుదల’ సినిమా నుంచి ‘దివ్వికి దివ్వికి’ పాట ప్రోమో విడుదలైంది. కృతి శెట్టి, కీర్తి సురేష్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను నవంబర్ 21న ఉదయం 11:34 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట ‘గొబ్బియల్లో’ తరహాలో అలరిస్తుందనే అంచనాలు పెరిగాయి.

By - Madhu Reddy
Update: 2026-11-21 04:22 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పటాస్ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన ఈయన.. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. ఇక అప్పటినుంచి ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనిల్ రావిపూడి తన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి కలర్ఫుల్ స్క్రీన్ స్పేస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దరేసి హీరోయిన్లతో స్క్రీన్ ను మరింత రంగులమయం చేస్తున్నారని చెప్పవచ్చు.

ఇక అందులో భాగంగానే ఈ ఏడాది ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జనవరి 12న విడుదల'. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ , కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన అనిల్ రావిపూడి..అప్పుడే సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసి సినిమా నుండి ఒక్కొక్క అప్డేట్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అందులో భాగంగానే నవంబర్ 20వ తేదీన సినిమా నుండి "దివ్వికి దివ్వికి" అంటూ ఒక సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.

అనంత శ్రీరామ్ ఈ పాటను రచించగా.. మధుప్రియ, అశ్విని అద్భుతంగా గాత్రం అందించారు. ముఖ్యంగా హీరోయిన్లను ఉద్దేశించి రాసిన ఈ పాట ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది . ఈ పూర్తి లిరికల్ వీడియోని నవంబర్ 21 ఉదయం 11: 34 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగులో కృతి శెట్టి, కీర్తి సురేష్ తమ డాన్స్ పర్ఫామెన్స్ తో అద్భుతమైన ఔట్ఫిట్ తో చాలా అద్భుతంగా కనిపించారు. ఇద్దరి పెర్ఫార్మెన్స్ దూకుడు చూస్తుంటే ఈ పాట మరో బ్లాక్ బాస్టర్ అవుతుందనే కామెంట్లు వ్యకక్మవుతున్నాయి.

ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న పాటను చూస్తుంటే..' సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని "గొబ్బియల్లో గొబ్బియల్లో" అనే పాటను ఆడియన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఈ పాటలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ఇద్దరు ఒకరిని మించి మరొకరు డామినేట్ చేస్తూ తమ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. అంతేకాదు ఇద్దరి హీరోయిన్ల కలర్ స్పేస్ కి ఆడియన్స్ కూడా ముగ్ధులైపోయారు. ఇక సరిగ్గా ఇప్పుడు జనవరి 12న విడుదల సినిమాలో కూడా ఈ ఇద్దరి హీరోయిన్స్ పై అనిల్ రావిపూడి ఒక పాటను చిత్రీకరించడంతో ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి తమ పెర్ఫార్మన్స్ ఎలా అయితే ఆకట్టుకున్నారో.. ఈ పాటలో కృతి శెట్టి , కీర్తి సురేష్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం ఈ రెండు పాటలలో ఏ పాట అత్యంత ఆదరణ సొంతం చేసుకుంటుందో

Tags:    
  • anilravipudi 
  • kritishetty 
  • keerthysuresh 
  • divvikidivviki 
  • january12vidudala 

Similar News

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS