• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డాక్టర్, యాక్టర్, డాన్సర్...

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

| నటి సాయి పల్లవి తనలోని మరో ప్రతిభను బయటపెట్టింది. తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, హిందీ, జార్జియన్‌తో పాటు మాతృభాష బడగలోనూ మాట్లాడగలనని ఓ టాక్‌షోలో వెల్లడించింది. మొత్తం ఏడు భాషలు మాట్లాడగలనని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By - Madhu Reddy
Update: 2026-11-21 04:25 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు సాయి పల్లవి. భాషతో సంబంధం లేకుండా.. పాత్రతో పట్టింపు లేకుండా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. అటు అల్లరి పిల్లగా ఇటు గృహిణిగా.. సీతాదేవి పాత్రలో కూడా ఒదిగిపోయిన ఈమె.. ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అదరగొట్టేసింది. ఇలా ఒక్కటేమిటి తన వరకు వచ్చిన ప్రతి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.

సాయి పల్లవి యాక్టర్ మాత్రమే కాదు మంచి డాక్టర్ కూడా.. ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఈమె.. ఒకవైపు వైద్యవృత్తిని కొనసాగిస్తూనే.. మరొకవైపు తన దగ్గరకు వచ్చిన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే.. అందులో నటించడానికి కూడా వెనకాడడం లేదు. అలా ఒకవైపు యాక్టర్ గా, ఇటు డాక్టర్ గా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న ఈమె.. డాన్సర్ గా కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అలాంటి ఈమెలో మరో టాలెంట్ ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక టాక్ షోకి గెస్ట్ గా వెళ్లిన సాయి పల్లవి అక్కడ హోస్ట్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

అందులో భాగంగానే మీకు ఎన్ని భాషలు వచ్చు? అని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ, జార్జియం వంటి భాషలు మాట్లాడగలను. ఇక నా మాతృభాష బడగా కాబట్టి.. అందులో నేను చక్కగా మాట్లాడగలను. అలా నాకు మొత్తం ఏడు భాషలు వచ్చు అని తెలిపింది. మరి కన్నడ అంటే.. కన్నడ నాకు తెలియదు.. అర్థం కాదు కూడా అంటూ ఆమె తెలిపింది. అలా మొత్తానికి 7 భాషలు మాట్లాడగలను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా డాక్టర్ గా, డాన్సర్ గా, యాక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇన్ని భాషలు మాట్లాడగలరా అంటూ ఈమె టాలెంట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక సాయి పల్లవి కెరియర్ విషయానికొస్తే.. ఇటీవలే నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణ చిత్రంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది సాయి పల్లవి. అలాగే ధనుష్ ప్రధాన పాత్రలో నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓం చిత్రంలో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా నటించి యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. అంతేకాదు ఇన్ని రోజులు యాక్షన్ కి దూరంగా ఉన్న ఈమె.. ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరిపోయింది.

సాయి పల్లవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. రామాయణ పార్ట్ 2తో పాటు మణిరత్నం దర్శకత్వంలో ఏ ఆర్ రెహమాన్ సంగీతం లో రూపొందుతున్న ఇంజి వెల్లం అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే కల్కి 2898ఏడిలో కూడా ఈమె భాగమైనట్లు సమాచారం.

Tags:    
  • saipallavi 
  • saipallavitalents 
  • ramayana 
  • ommovie 
  • tollywood 

Similar News

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS