'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించని స్టేట్‌మెంట్!
| నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’పై భారీ అంచనాలు పెట్టుకోవాలని ఆయన అభిమానులను కోరారు. సినిమా తప్పకుండా గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.
అక్కినేని నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `వృషకర్మ`. ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం ఎంతో దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా రెండో పాటను విడుదల చేయగా.. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో నాగచైతన్య తన సినిమాపై ఎంతో నమ్మకంగా బోళా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై అంచనాలను ఆకాశమంత ఎత్తులో పెట్టుకుని థియేటర్లకు రావాలని.. `వృషకర్మ కచ్చితంగా అందరికీ ఒక అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చై ధీమాను వ్యక్తం చేశారు.
ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసిన నాగచైతన్య ఒక గుహలో కథ ఎలా ప్రారంభమవుతుందో ... ఆ తర్వాత భవిష్యవాణి ఆధారంగా కథ ముందుకు సాగుతూ ఎలా మలుపులు తిరుగుతుందో తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించే భారీ విజువల్ ట్రీట్ ఇస్తున్నామని అన్నారు. ప్రేక్షకులు ఎంతటి భారీ అంచనాలతో వచ్చినా వాటిని తాము తప్పకుండా అందుకుంటామని.. డిసెంబర్ 4న థియేటర్లలో కలుద్దామని చైతూ అభిమానులకు పిలుపునిచ్చారు.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్ డ్రామాగా `వృషకర్మ` రూపొందుతోంది. కథ ఆద్యంతం ఒక గుహలో మొదలై రక్తి కట్టించనుంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నాగచైతన్య అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ప్రమోషనల్ ఈవెంట్లో చైతూ మరింత హైప్ పెంచేసారు. అతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి కూడా గట్టిగానే హిట్టు కొట్టేట్టు ఉన్నాడని అందరూ అంచనా వేస్తున్నారు. విరూపాక్ష లాంటి భారీ హిట్ చిత్రాన్ని అందించిన కార్తీక్ దండుపైనా అందరిలో అంచనాలున్నాయి. చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా వస్తున్న `వృషకర్మ` డిసెంబర్ 4న థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తుందో చూడాలి.