ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!
| నిధి అగర్వాల్ డీప్ పర్పుల్ డిజైనర్ లెహంగా చీరలో మెరిసింది. గోల్డ్, సిల్వర్ ఎంబ్రాయిడరీ, భారీ జుంకాలు, గాజులతో సంప్రదాయ లుక్‌కు గ్లామర్ జోడించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న లేడీ ఓరియంటెడ్ పౌరాణిక థ్రిల్లర్‌లో నటించనుంది.
అందాల నిధిని ఎప్పటికప్పుడు ఆడియన్స్ కు చూపిస్తూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సెగలు పుట్టిస్తున్న నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా.. పలు అవకాశాలు అందుకుంటున్న ఈమె.. తన గ్లామర్ ఫోటోలతో యావత్ దేశ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. చీర కట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూనే.. అటు అదే చీరకట్టులో గ్లామర్ వలకబోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చీరకట్టులో కూడా ఇంత గ్లామర్ వలకబోయొచ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ విషయానికి వస్తే.. డీప్ పర్పుల్ డిజైనర్ లెహంగా ధరించింది నిధి అగర్వాల్. చీర లాగా కట్టుకునే ఫ్యూజన్ లెహంగా చీర ఇది. కింది భాగంలో లెహంగాకు కుచ్చులు ఉండి, పైన చీర కొంగు స్టైల్ లో వస్తుంది. ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే తేలికపాటి షిఫాన్ ఫ్యాబ్రిక్ తో దీనిని డిజైన్ చేశారు.
చీర అంచున మొత్తం గోల్డ్ ,సిల్వర్ రంగుల జరీ సీక్వెన్స్, పూసల వర్క్ తో పాటు అందమైన లేస్ , కట్ వర్క్ డిజైన్ తో డిజైన్ చేశారు. ఇక చీర మధ్య భాగంలో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీలు లెహంగా అందాన్ని రెట్టింపు చేశాయి. ఇక లెహంగా కింది భాగంలో భారీ జర్దోసి, జరీ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేశారు.
బ్లౌజ్ విషయానికి వస్తే.. చీరకి మ్యాచింగ్ గా స్వీట్ హార్ట్ నెక్ లైన్ కలిగిన హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ని ధరించింది. చేతులకు చిన్నచిన్న పూసల హ్యాంగింగ్స్ ను జోడించారు. పెద్దపెద్ద జుంకాలు ధరించిన ఈమె చేతికి బంగారు రంగు గాజులు ధరించి తన అవుట్ ఫిట్ ని ఫుల్ ఫిల్ చేసుకుంది. ఇక ఈ చీర లాంటి లెహంగాలో అందాలు ఆరబోస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నిధి అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ది రాజాసాబ్ సినిమాతో డిజాస్టర్ ను చవిచూసింది. నిధి అగర్వాల్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో.. పౌరాణిక థ్రిల్లర్ మూవీగా రాబోతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రానికి ఈమె సంతకం చేసింది. ఆగస్టులో గ్రాండ్గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుంది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.