• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాత్రికిరాత్రి స్టార్...

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

| ‘ధురంధర్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలోని కష్టాలను గుర్తుచేసుకున్నారు. భార్య యామీ గౌతమ్ తనకు లక్కీ చార్మ్ అని చెప్పారు. కథ కోసం 70 గంటలు నిద్రపోకుండా పనిచేసేవారని యామీ వెల్లడించారు. ‘ధురంధర్’ సిరీస్ విజయాలతో ఆదిత్య తదుపరి సినిమాపై ఆసక్తి పెరిగింది.

By - Srikanth Kontham
Update: 2026-11-20 17:31 GMT

బయటి నుంచి చూసేవారికి సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వ‌గానే దర్శకుడు రాత్రికిరాత్రి స్టార్ అయిపోయాడని అనిపిం చొచ్చు. కానీ ఆ గుర్తింపు వెనుక ఎంతో శ్ర‌మ‌..ఏళ్ల నిరీక్షణ.. కష్టం ఉంటుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వాళ్ల‌కే తెలుస్తుంది.

తాజాగా ఇదే విష‌యాన్ని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంతో ఓపెన్ అయ్యారు.`ధురంధర్` సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిత్య ప్రయాణంలోని ఆటుపోట్లను గుర్తు చేసుకున్నారు. ఇరవై ఏళ్ల పోరాటం తర్వాత ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారడం అద్భుతమైన ప్రయాణమని.. యామీ తన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే తలరాత మారిందన్నారు.

యామీ తనకు లేడీ లక్ అని.. భారతీయ కథలను ప్రపంచానికి చెప్పే బలం ఆ తోడుతోనే వచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆదిత్య పనితీరు.. అంకితభావం గురించి యామీ గౌతమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆదిత్య అనుకున్న కథను తెరపైకి తీసుకురావడానికి డెబ్బై గంటల పాటు నిద్ర కూడా లేకుండా సెట్స్‌లోనే పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. భారీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలంటే గుండెధైర్యం.. నమ్మకం ఎంతో అవసరమని ఆ విషయంలో ఆదిత్య ఎప్పుడూ వెనకడుగు వేయరని కొనియాడారు.

2006లో సినీ కలలతో ముంబైకి వచ్చిన ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. పాటల రచయితగా.. స్క్రీన్ ప్లే రైటర్‌గా చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ వచ్చారు. `కాబుల్ ఎక్స్‌ప్రెస్`, `ఆక్రోష్`, `తేజ్` వంటి సినిమాలకు పనిచేసిన తర్వాత 2019లో `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్‌`తో దర్శకుడిగా తొలి అడుగులోనే జాతీయ అవార్డు సాధించారు. ఆ తర్వాత సోదరుడు లోకేష్ ధర్‌తో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించి `ఆర్టికల్ 370`, `ధూమ్ ధామ్`,` బారాముల్లా` వంటి ప్రాజెక్టులతో నిర్మాతగానూ ముద్ర వేశారు.

ఏడేళ్ల విరామం తర్వాత దర్శకుడిగా తిరిగొచ్చిన‌ ఆదిత్య రూపొందించిన `ధురంధర్` ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. అటుపై వ‌చ్చిన `ధురంధర్: ది రివెంజ్` కూడా దేశీయ బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండియన్ బాక్సాపీస్ వ‌ద్ద స‌రికొత్త చ‌రిత్ర రాసారు. దీంతో ఇరవై ఏళ్ల శ్రమకు అసలైన ప్రతిఫలం ద‌క్కిన‌ట్లు అయింది. దీంతో దేశ భ‌క్తి నేపత్యం, స్పై సినిమాల‌కు ఆదిత్య బ్రాండ్ అంబాడిస‌డ‌ర్ గా మారిపోయారు. త‌దుప‌రి ఆదిత్య ఏ హీరోతో సినిమా చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇత‌డితో సినిమా చేయ‌డానికి అగ్ర హీరోలంతా క్యూలో ఉన్నారు. మ‌రి ఛాన్స్ ఎవ‌రికిస్తారు? అన్న‌ది చూడాలి.

Tags:    
  • adityadhar 
  • yamigautam 
  • dhurandhar 
  • dhurandhartherevenge 
  • bollywood 

Similar News

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

టాలీవుడ్‌కు వీళ్లే సరిపోతారా!

2026-11-20 17:29 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

Copyright @2026

Powered by Blink CMS