• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్‌లో...

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

| టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు రావడం లేదంటూ నటి శివాత్మిక రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే చాందిని చౌదరి, ఈషా రెబ్బా, అనన్య నాగళ్ల, వైష్ణవి చైతన్య వంటి నటీమణులు తెలుగులో వరుస అవకాశాలతో రాణిస్తున్నారని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిభ, కథల ఎంపికే పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.

By - Sivaji Kontham
Update: 2026-11-21 04:22 GMT

తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో సరైన అవకాశాలు దక్కడం లేదంటూ ఓ ఈవెంట్లో నటి శివాత్మిక రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. జీవిత-రాజశేఖర్ దంపతుల కుమార్తెగా `దొరసాని` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక.. ఆ తర్వాత నాలుగైదేళ్ల వ్యవధిలో కేవలం మూడు తెలుగు సినిమాలు మాత్రమే చేయగలిగారు. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం వల్లే తాను తమిళ పరిశ్రమపై దృష్టి సారించాల్సి వచ్చిందని ఆమె అన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన `ఈ నగరానికి ఏమైంది` సీక్వెల్ `ఈఎన్ఈ 2`లో అవకాశం దక్కించుకున్న శివాత్మిక.. తనకు ఛాన్స్ ఇచ్చిన టీమ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూనే తెలుగమ్మాయిల అవకాశాలపై తన ఆవేదనను పరోక్షంగా వ్యక్తం చేశారు.

అయితే శివాత్మిక వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలకు అసలు అవకాశాలే రావడం లేదన్న వాదనలో పూర్తి నిజం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోల సరసన వరుసగా భారీ ప్రాజెక్టులు దక్కకపోయినా.. ప్రతిభ ఉన్న స్థానిక నటీమణులకు మన దర్శకనిర్మాతలు చిన్న- మధ్య తరహా చిత్రాలతో పాటు కంటెంట్ ప్రధానమైన సినిమాల్లో అవకాశాలు ఇస్తూనే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. కేవలం శివాత్మికకు మాత్రమే తెలుగులో గ్యాప్ వచ్చింది కానీ.. మిగిలిన తెలుగమ్మాయిలు తమదైన శైలిలో బిజీగానే ఉన్నారని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం రాణిస్తున్న తెలుగమ్మాయిల జాబితాను పరిశీలిస్తే .. చాందిని చౌదరి కంటెంట్ ఆధారిత సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాగే ఈషా రెబ్బా గ్లామర్- నటన రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ తెలుగులో అవకాశాలు అందుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అనన్య నాగళ్ల తన మార్క్ చూపిస్తుండగా.. కంటెంట్ క్రియేషన్ నేపథ్యం నుంచి వచ్చిన వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. వీరితో పాటు కొత్త తరం తెలుగు నేపథ్యం ఉన్న నటీమణులకు సైతం ప్రాధాన్యమున్న పాత్రలు దక్కుతున్నాయి.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తమ నటనను మెరుగు పరుచుకోవడం ఏ నటికైనా చాలా ముఖ్యమని సినీ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెద్ద స్టార్ల‌తో ఆఫ‌ర్లు వ‌స్తేనే పెద్ద జీవితం అనుకోన‌వ‌స‌రం లేదు. ఈ రంగంలో అన్నిటినీ త‌ట్టుకుని ఎదగ‌డం ముఖ్యం. భాషతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభ.. స‌రైన‌ కథల ఎంపిక.. స్థిరమైన విజయాలు మాత్రమే ఇండస్ట్రీలో నిలబెడతాయనేది నేటిత‌రం గ్ర‌హించాలి. పరభాషా నటీమణులతో పోటీ పడాలంటే కేవలం స్థానికత ఒక్కటే సరిపోదని.. వైవిధ్యమైన పాత్రలకు సిద్ధంగా ఉంటూ ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వరుస అవకాశాలు తలుపు తడతాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈఎన్ఈ 2తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్న శివాత్మికకు ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. ఒకవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు తెలుగులోనూ తన సత్తా చాటాలని శివాత్మిక ఆశిస్తున్నారు. ఈ పోటీ ప్ర‌పంచంలో నేటి జెన్ జీ తెలుగ‌మ్మాయిలు దూసుకెళ్లాలంటే ఇంకా ఏం కావాలో స్వ‌యంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. సినిమాలు లేదా సిరీస్‌లు లేదా డ్రామాలు క‌ళారంగంలో అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎవ‌రైనా క‌ళాకారిణి కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకునే అగ్ర హీరోయిన్ల‌తో త‌మ‌ను ఎప్ప‌టికీ పోల్చుకోక‌పోవ‌డం ఉత్త‌మం!


తెలుగు అమ్మాయినే అయినప్పటికీ, ఇక్కడ సరైన అవకాశాలు దొరకలేదు. తమిళంలో సినిమాలు చేస్తూ వస్తున్నాను. – #ShivathmikaRajasekhar #ENERepeat #ENE2 #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/29JYvfIQnc

— Tupaki (@tupaki_official) November 20, 2026


Tags:    
  • shivathmika 
  • shivathmikrajashekhar 
  • ene2 
  • tollywood 
  • teluguheroines 

Similar News

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS