• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ పవర్ స్టార్...

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

| పిఠాపురంలో అపోలో ఫౌండేషన్ నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఉపాసన కొణిదెల, స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఉపాసన ‘పవర్ స్టార్ కాదు.. ఎం పవర్ స్టార్’ అంటూ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా 109 మోడల్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

By - Madhu Reddy
Update: 2026-11-21 06:33 GMT

ఉపాసన కామినేని కొణిదెల.. భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థాపకురాలిగా, సీఎస్ఆర్ వైస్ చైర్ పర్సన్ గా, అపోలో హాస్పిటల్స్, వెల్నెస్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకురాలిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మెగా కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా ఇటు సినీ రంగంలో కూడా అంతే ఆదరణ అందుకుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. అటు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన పవర్ స్టార్ కాదు ఎం పవర్ స్టార్ అంటూ కొత్త బిరుదును ఇచ్చారు ఉపాసన.

అసలు విషయంలోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంలో అపోలో ఫౌండేషన్ టోటల్ హెల్త్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 'అపోలో ఆరంభ్' మోడల్ అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఉపాసన, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఘనంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఈ మోడ్రన్ అంగన్వాడి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్మృతి ఇరానీ , ఉపాసన కొణిదెల ప్రసంగించారు. ఇక్కడ ఏకంగా రూ.50 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం నిర్మించడం గమనార్హం. ఇందులో ఆహ్లాదకరమైన పరిసరాలు , డిజిటల్ పాఠాలకు ఎల్ఈడి స్క్రీన్లు, భోజనం, విద్యార్థులు కూర్చోవడానికి చైర్లు, టేబుల్స్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన దక్షతపై ప్రశంసలు కురిపిస్తూ ఈ విధంగా మాట్లాడారు. "మీ అందరికీ పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ అయ్యుండొచ్చు. కానీ నాకు మాత్రం ఆయన ఎం పవర్ స్టార్. పిఠాపురంలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దగ్గరగా చూసిన తర్వాత నాకు ఒక ఎం పవర్ స్టార్ గా కనిపిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా, స్వయం సమృద్ధి సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, సులభతర రుణాల కల్పన పై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్కూల్, కాలేజీల ఏర్పాటు ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ వారి సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నారు" అంటూ ఉపాసన పవన్ కళ్యాణ్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మొత్తానికైతే అభిమానులు, ప్రజలు ఈయనకు పవర్ స్టార్ అనే బిరుదును ఇస్తే.. ఆయన కోడలు ఉపాసన ఎం పవర్ స్టార్ అంటూ కొత్త బిరుదును ఇచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. అపోలో ఆరంభ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్రంలో మొత్తం 109 మోడల్ అంగన్వాడి కేంద్రాలను డెవలప్ చేయబోతున్నాము.. ఇది కూడా కుటుంబ సహకారంతో మొదటి కేంద్రంని పిఠాపురంలో అందుబాటులోకి తీసుకొచ్చాం అంటూ తెలిపారు ఉపాసన. ఈ కేంద్రం స్థానిక తల్లులు, చిన్నారుల సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని కూడా నిర్వహకులు తెలియజేశారు.

Tags:    
  • upasanakonidela 
  • pawankalyan 
  • mpowerstar 
  • powerstar 
  • ramcharan 

Similar News

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

'ఈగో రాజాస్' టీజర్: లోన్ యాప్స్ దందాలో ఆది సాయి కుమార్

2026-11-21 06:32 GMT

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

2026-11-21 06:32 GMT

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026-11-21 06:31 GMT

హీరో నుంచి కాపాడ‌మ‌ని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే ప‌రార్!

2026-11-21 06:29 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS