• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలియా భట్‌కు ఇల్లు...

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

| గూగుల్‌లో తన ఆస్తి విలువ రూ.400-500 కోట్లు అని చూపిస్తున్న లెక్కలు పూర్తిగా తప్పని నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. ఆ మొత్తంలో పదో వంతు కూడా తన దగ్గర లేదని స్పష్టం చేశారు. ఆస్తుల నిర్వహణ తలనొప్పులు వద్దనే పదేళ్ల క్రితమే అద్దె ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-21 06:33 GMT

ఆస్తిపాస్తులు కూడబెట్టడం కంటే మనసు ప్రశాంతంగా.. తేలికగా ఉండటమే అసలైన స్వేచ్ఛ అని కొంత అనుభ‌వం త‌ర్వాత ఎవ‌రికైనా అర్ద‌మ‌వుతుంది. ఉన్న‌దాంట్లో సంతృప్తిగా రోగాలు బారిన ప‌డ‌కుండా ఉంటే చాలు. అంత‌కు మించిన ఆస్తి ఏముంటుంద‌ని తేట తెల్ల‌మ‌వుతుంది. అదే డ‌బ్బు మాయలో ప‌డితే? ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. తాజాగా అనుపమ్ ఖేర్ ఓ ఇంటర్వ్యూలో గూగుల్‌లో తన ఆస్తి విలువ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉందని చూపిస్తున్న లెక్కలపై స్పందించారు.

అంత మొత్తం తన దగ్గర పదో వంతు కూడా లేదని అలాంటి తప్పుడు సమాచారం రాస్తున్న వెబ్‌సైట్లపై కోర్టులో కేసు వేయాలనిపించే సందర్భాలు కూడా వస్తాయన్నారు. ఆన్ లైన్‌లో వచ్చే అంకెలు చూసి స్నేహితులు సైతం ఆ డబ్బులో కొంత తమకూ పంపమని సరదాగా ఆటపట్టిస్తుంటారని అనుపమ్ చెప్పుకొచ్చారు. ముంబైలోని తన ఇంటిని ఆలియా భట్‌కు విక్రయించిన తర్వాత దాదాపు పదేళ్ల క్రితమే అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉండాలని అనుపమ్ నిర్ణయించుకున్నారు. భార్య కిరణ్ ఖేర్ ఎంపీగా చండీగఢ్ వెళ్లడం, ఆస్తి నిర్వహణ తలనొప్పులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అనుప‌మ్ సోదరుడు కూడా అద్దె ఇంట్లోనే సంతోషంగా ఉంటున్నారని.. ఆస్తుల తలనొప్పులు వదిలిపెట్టాకే నిజమైన విముక్తి లభించిందని అనుపమ్ అభిప్రాయపడ్డారు. అద్దె ఇంట్లో ఉంటున్నంత మాత్రాన సౌకర్యాలను ఏమీ తగ్గించుకోలేదని అనుపమ్ స్పష్టం చేశారు. మంచి రెస్టారెంట్లలో తినడం..హాయిగా ప్రయాణించడం.. మెరుగైన హోటళ్లలో బస చేయడం వంటి విషయాలను ఎప్పుడూ ఆస్వాదిస్తానన్నారు. సింపుల్‌గా ఉండటం అంటే ఏదో పూరి గుడిసెలో ఉన్నట్లు కాదని తనకు ఇష్టమైన జీవనశైలిలో ఎలాంటి లోటు లేదని తేల్చి చెప్పారు.

తల్లి కోరిక కోసం మాత్రం సిమ్లాలో ఒక ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని అనుపమ్ గుర్తు చేసుకున్నారు. సుమారు అరవై ఏళ్ల పాటు అద్దె ఇళ్లలోనే గడిపిన తల్లి సిమ్లాలో సొంత ఇల్లు కావాలని అడిగారట. ఆమె చిన్న ఇల్లు అడిగినా? ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో హాల్‌తో పాటు ఎనిమిది బెడ్‌రూమ్‌ల పెద్ద ఇంటిని కొనిచ్చినట్లు చెప్పారు. సమాజంలో ఆస్తుల కోసం వృద్ధ తల్లిదండ్రులపై జరుగుతున్న వేధింపులు.. కుటుంబ తగాదాలు చూసినప్పుడు తన నిర్ణయం సరైనదేనని మరింత బలంగా అనిపిస్తుందని అనుపమ్ అన్నారు.

`సారాంశ్` సినిమాకు పది వేల రూపాయలు తీసుకున్న రోజుల నుంచి నేటి ప్రయాణం వరకు ఎప్పుడూ అనవసరపు ఆడంబరాల వెంట పరుగెత్తలేదని అనుప‌మ్ తెలిపారు. ఎంత డౌన్ టూ ఎర్త్ ఉన్న‌దాంట్లో స‌ర్దుకుపోయే త‌త్వం ఉంటే జీవితం ప్ర‌శాంతంగా సాగిపోతుంద‌న్నారు. ఇటీవ‌లే నితీశ్ తివారీ దర్శకత్వంలో రిలీజ్ అయిన `రామాయణ: పార్ట్ 1`లో జటాయువు పాత్రకు అనుప‌మ్ కేర్ డ‌బ్బింగ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా పాన్ ఇండియాలో అనుప‌మ్ ఖేర్ నెట్టింట పాపుల‌ర్ అవుతున్నారు.

Tags:    
  • anupamkher 
  • anupamkhernetworth 
  • bollywood 
  • celebritynetworth 

Similar News

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

'ఈగో రాజాస్' టీజర్: లోన్ యాప్స్ దందాలో ఆది సాయి కుమార్

2026-11-21 06:32 GMT

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

2026-11-21 06:32 GMT

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026-11-21 06:31 GMT

హీరో నుంచి కాపాడ‌మ‌ని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే ప‌రార్!

2026-11-21 06:29 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS