• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఈగో రాజాస్' టీజర్: లోన్...

'ఈగో రాజాస్' టీజర్: లోన్ యాప్స్ దందాలో ఆది సాయి కుమార్

| ఆది సాయికుమార్, సతీష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఈగో రాజాస్’ టీజర్‌ను రవితేజ విడుదల చేశారు. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ వేధింపులు, మధ్యతరగతి కుటుంబాల కష్టాల నేపథ్యంలో గురు శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లోకల్ రికవరీ ఏజెంట్‌గా ఆది రఫ్ లుక్‌లో కనిపించగా, రామచంద్రరాజు మాఫియా బాస్‌గా ఆకట్టుకున్నారు.

By - M Prashanth
Update: 2026-11-21 06:32 GMT

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, క్షణాల్లో లోన్ ఇస్తామంటూ వల వేసే ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ వేధింపులు ఇప్పుడు సమాజంలో పెద్ద సమస్యగా మారాయి. ఇదే కాంటెంపరరీ పాయింట్ తో ఆది సాయికుమార్, తమిళ నటుడు సతీష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఈగో రాజాస్'. గురు శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ గా విడుదల చేశారు.

"ఈ ప్రపంచమే డబ్బు వెనక పరిగెడుతోంది, కానీ తను వాళ్లలో ఒకడు కాదు.. డిజిటల్ డెవిల్" అనే వాయిస్ ఓవర్ తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. నెల జీతాల మీద ఆధారపడే మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ ను టార్గెట్ చేస్తూ, లోన్ యాప్స్ ద్వారా ఉచ్చులోకి లాగే మాఫియా బాస్ గా 'కేజీఎఫ్' ఫేమ్ రామచంద్రరాజు కనిపించారు. ఆ ఉచ్చులో చిక్కుకునే సగటు మధ్యతరగతి ఉద్యోగి పాత్రలో సతీష్ సహజంగా ఒదిగిపోయారు.

అప్పు తీసుకున్న సామాన్యులను దారికి తెచ్చుకోవడానికి ఆ ఫైనాన్స్ కంపెనీకి ఒక ఊర మాస్ కుర్రాడు అవసరమవుతాడు. ఆ 'లోకల్' రికవరీ ఏజెంట్ సేతు పాత్రలో ఆది సాయికుమార్ తన గత చిత్రాలకు భిన్నంగా రఫ్ లుక్ లో కనిపించారు. "ఇది మన కంపెనీ రూల్స్ లో లేదు" అని తోటి ఉద్యోగి వారించినప్పుడు, "ఇది నా రూల్" అంటూ ఆది చెప్పే డైలాగ్, ఆఫీసులోనే చేసే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా లోన్ యాప్స్ వల్ల సామాన్య కుటుంబాలు పడే నరకాన్ని కూడా టీజర్ లో చూపించారు. అప్పు కట్టలేదనే కారణంతో వాట్సాప్ ద్వారా వేధించడం, అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి సీన్స్ ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. మొదట ఫైనాన్స్ కంపెనీ తరఫున నిలబడే హీరో, ఈ దారుణాలు చూశాక తన రూట్ ఎలా మార్చుకున్నాడనేది సినిమాలో కీలకంగా కనిపిస్తోంది.

సాంకేతికంగా టీజర్ క్వాలిటీ బాగుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ విజువల్స్ ను రిచ్ గా చూపించగా, జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని పెంచింది. ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రూపొందుతున్న ఈ మూవీతో ఆది సాయికుమార్ కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉండే సీరియస్ సబ్జెక్ట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు గురు శరవణన్ ఈ చిత్రాన్ని మలిచినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కు ఈ డిఫరెంట్ రోల్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.


Full View


Tags:    
  • egoraja 
  • aadisaikumar 
  • raviteja 
  • sathish 
  • ramachandraraju 
  • egorajateaser 

Similar News

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

2026-11-21 06:32 GMT

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026-11-21 06:31 GMT

హీరో నుంచి కాపాడ‌మ‌ని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే ప‌రార్!

2026-11-21 06:29 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS