ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!
| ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు భారీ వినోదం అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్, జియో హాట్‌స్టార్, జీ5లో పలు తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నవంబర్ 22న ‘రంగస్థలం’ కూడా ఓటీటీలోకి రానుంది.
వారాంతం వచ్చిందంటే చాలు సినీ లవర్స్ కి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తమకు ఇష్టమైన, నచ్చిన సినిమాను అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో చూడడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ కి మరో పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఈ వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. తెలుగు నుండి హిందీ వరకు, సినిమాల నుండి సిరీస్ వరకు ఎన్నో భిన్నమైన కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయాయి. మరి ఈ వారాంతంలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్న ఆ చిత్రాలు, సీరియస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సినీ లవర్స్ కి శుభవార్త చెప్పిన అమెజాన్:
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్న కీలక పాత్రలో నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ' ది వన్ ' ప్రేక్షకులను అలరించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రంతోపాటు ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో విడుదలై రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ' ప్రేమద ఊరలి '. దీన్నే తెలుగులో 'ప్రేమనే ఊరిలో' అనే చిత్రంతో విడుదల చేశారు.ప్రస్తుతం ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. వీటితోపాటు 'డ్రోన్స్ ', ఇండియన్ ఫస్ట్ స్లాషర్ మూవీగా ఆడియోస్ ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. అలాగే 'మయూక' తెలుగు మూవీ తో పాటు 'మర్నామి' , 'సిటీ లైట్స్' వంటి కన్నడ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కి వచ్చాయి. ది ఒడిస్సీ తెలుగు, ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 'మ్యాడ్ డెన్' అనే మరో మూవీ కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ లో మూవీ మస్తీ..
కోర్ట్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి తొలిసారి హిందీలో నటించిన చిత్రం 'హైకూ'. ఏగన్, ఫెమినా జార్జ్ , శ్రీదేవి కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంతోపాటు ప్రశాంత్ నీళ్ నిర్మాణంలో వచ్చిన హారర్ మూవీ '418'కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. హిందీ వెబ్ సిరీస్ 'మాంగ్లిక్', 'దిందోరా సీజన్ 2' తోపాటు 'గార్డియన్ స్టార్స్ ' తెలుగు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రాగా.. ఇంగ్లీష్ మూవీ 'జెంటిల్ మాన్స్టర్' కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాగే మరో వెబ్ సిరీస్ 'ది అలాట్రస్ట్' తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రాగా, ఇంగ్లీష్ , తెలుగు భాషల్లో 'స్టెప్స్'అనే మూవీ కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. వీటితో పాటు 'ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్' అనే మూవీ కూడా ఇంగ్లీషులో అందుబాటులోకి వచ్చింది.
అందుబాటులో మరికొన్ని చిత్రాలు, సిరిస్ లు..
ఇక ఈటీవీ విన్ లో 'రెచ్చిపోదాం బ్రదర్', 'ఆల్మోస్ట్ అర్జున్' వంటి చిత్రాలు అందుబాటులోకి రాగా.. 'రంగస్థలం' సినిమా నవంబర్ 22న స్ట్రీమింగ్ కి రానుంది. అటు సన్ నెక్స్ట్ లో 'చీరమ్' అనే మలయాళంతో పాటు 'అనుమాన పక్షి' అనే తెలుగు సినిమా కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక జియో హాట్ స్టార్ లో తమిళ్ వీక్లీ సిరీస్ 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' కూడా అందుబాటులో ఉంది. అలాగే తెలుగు మూవీ 'కికూ చిరంజీవి'తో పాటు హిందీ మూవీ 'దుల్హనియా లేయాగీ' అనే చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు జీ ఫైవ్ లో 'టీన్ తిగడ' అనే హిందీ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.