గత పదేళ్ల బాక్సాఫీస్ రికార్డులు.. టాలీవుడ్ టాప్ లేపిన సినిమాలు ఇవే!

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 1810 కోట్లు కొల్లగొట్టి భారతీయ సినిమా చరిత్రనే మార్చేసింది. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు.;

Update: 2025-12-17 04:35 GMT

గత పదేళ్ల కాలంలో తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఒకప్పుడు మన సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతున్నారు. 2016 నుంచి 2025 వరకు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఏడాది ఎవరో ఒకరు రికార్డులను తిరగరాస్తూనే ఉన్నారు.

ఈ దశాబ్ద కాలంలో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం బాక్సాఫీస్ ను ఏలిన ఆ సినిమాలు ఏంటో, వాటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బాహుబలి 1 తో జక్కన్న ఒక పవర్ఫుల్ ట్రాక్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా 600 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు అంచనా. ఇక 2016లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లెక్కతో మొదలు పెడితే... కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సుమారు 125 నుంచి 135 కోట్ల మధ్యలో వసూలు చేసి ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి 2 గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 1810 కోట్లు కొల్లగొట్టి భారతీయ సినిమా చరిత్రనే మార్చేసింది. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. ఆ తర్వాతి ఏడాది 2018లో రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పవర్ఫుల్ హిట్ కొట్టాడు. సుకుమార్ మ్యాజిక్ తో వచ్చిన ఈ సినిమా 216 కోట్లు రాబట్టి, నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.

ఇక 2019లో సాహో సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా చూపించారు. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా 433 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2020 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన అల..వైకుంఠపురములో.. సినిమాతో అల్లు అర్జున్ 262 కోట్లు రాబట్టారు. ఇక 2021 నుంచి టాలీవుడ్ రూపురేఖలు మారిపోయాయి. పుష్ప: ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ నార్త్ ఇండియాలో జెండా పాతారు. ఈ సినిమా సుమారు 373 కోట్లు వసూలు చేసింది.

2022లో రాజమౌళి మళ్ళీ ఆర్ఆర్ఆర్ తో వచ్చారు. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా 1316 కోట్లు వసూలు చేయడమే కాకుండా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. 2023లో ప్రభాస్ సలార్ తో వచ్చి 715 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేశారు. 2024లో మళ్ళీ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ తో బాక్సాఫీస్ ను రూల్ చేశారు. ఈ సినిమా కూడా భారీ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్ లెక్క 1700 కోట్లకు వెళ్లినట్లు టాక్.

ఇక ఈ ఏడాది 2025 విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఓజీ టాప్ లో నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 298 కోట్లు వసూలు చేసింది. గత కొన్నేళ్లతో పోలిస్తే 2025లో టాప్ గ్రాసర్ నెంబర్ తక్కువగానే ఉన్నా, ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఇదే నెంబర్ వన్ కావడం విశేషం.

గత 10 ఏళ్ల టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ (ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం)

గత పదేళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్

2016: జనతా గ్యారేజ్: 130 కోట్లు

2017: బాహుబలి 2: 1810 కోట్లు

2018: రంగస్థలం: 216 కోట్లు

2019: సాహో: 433 కోట్లు

2020: అల వైకుంఠపురములో: 262 కోట్లు

2021: పుష్ప ది రైజ్: 373 కోట్లు

2022: ఆర్ఆర్ఆర్: 1316 కోట్లు

2023: సలార్ సీజ్ ఫైర్: 715 కోట్లు

2024: పుష్ప 2 ది రూల్: 1700 కోట్లు

2025: ఓజీ: 298.1 కోట్లు

Tags:    

Similar News