నెల్లూరులో యాక్ష‌న్ కింగ్ కు వింత అనుభ‌వం

సినీ న‌టుల‌కు ఎలాంటెలాంటి అభిమానులుంటారో ప్ర‌త్యేకంగా చెప్పే ప‌న్లేదు. కొంద‌రు ఆ అభిమానంతోనే వారి ఫేవ‌రెట్ యాక్ట‌ర్ల‌కు గుడి క‌డితే, మ‌రికొంద‌రు వారి పేరిట అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు చేస్తూ ఉంటారు.;

Update: 2026-02-07 22:30 GMT

సినీ న‌టుల‌కు ఎలాంటెలాంటి అభిమానులుంటారో ప్ర‌త్యేకంగా చెప్పే ప‌న్లేదు. కొంద‌రు ఆ అభిమానంతోనే వారి ఫేవ‌రెట్ యాక్ట‌ర్ల‌కు గుడి క‌డితే, మ‌రికొంద‌రు వారి పేరిట అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు చేస్తూ ఉంటారు. త‌మ అభిమాన న‌టుల్ని క‌ల‌వ‌డానికి వాళ్లు చేసే ప‌నులు, ప‌డే పాట్లూ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడైనా త‌మ అభిమాన న‌టుల్ని క‌లిసే అవ‌కాశ‌మొస్తే దాని కోసం ఎంతదూర‌మైనా వెళ్తారు ఫ్యాన్స్.

అయితే ఆ అభిమానం, ప్రేమ కొన్నిసార్లు మితి మీరుతూ కూడా ఉంటుంది. త‌మ ఫేవ‌రెట్ న‌టుల‌ను క‌లుస్తున్నామ‌నే ఎగ్జైట్‌మెంట్ లో కొన్నిసార్లు ఫ్యాన్స్ అన్నీ మ‌ర్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటారు. దాని వ‌ల్ల స‌ద‌రు సెల‌బ్రిటీల‌కు ఎంతో ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు అలా ఫ్యాన్స్ వ‌ల్ల ఇబ్బంది ప‌డిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

ఒక్క‌సారిగా చుట్టూ గూమిగూడారు

తాను కూడా ఒక‌సారి అలాంటి ఇబ్బంది ప‌డిన‌ట్టు యాక్ష‌న్ కింగ్ అర్జున్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టారు. గ‌తంలో ఓ సారి నెల్లూరులో ఆ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు ఆయ‌న చెప్పారు. హోట‌ల్ నుంచి కారులోకి వెళ్లే టైమ్‌లో అక్క‌డ ఎంతోమంది ఫ్యాన్స్ గూమిగూడార‌ని, త‌నకు ప‌క్క‌న సెక్యూరిటీ ఉన్న‌ప్ప‌టికీ వారిని తోసేసి మ‌రీ ఫ్యాన్స్ త‌న‌పైకి తోసుకొచ్చార‌ని, త‌ర్వాత తాను చాలా క‌ష్ట‌మ్మీద కారులోకి ఎక్కి వెళ్లిపోయాన‌ని, తాను వెళ్లిన కాసేప‌టికి కానీ త‌న సెక్యూరిటీ రాలేక‌పోయార‌ని, ఫ్యాన్స్ ఇష్టం, ప్రేమ తోనే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఆ ప్రేమ, ఇష్టం కొన్ని సార్లు ఇబ్బంది క‌లిగిస్తాయ‌ని అర్జున్ చెప్పారు.

ఆ గుడి పూర్త‌వ‌డానికి 17 ఏళ్లు ప‌ట్టింది

న‌టుడిగా ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో సినిమాలు చేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు సీతా ప‌య‌నం అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న అర్జున్ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. అదే ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఆంజ‌నేయ స్వామి అంటే చాలా ఇష్ట‌మ‌ని, అందుకే తాను ఓ 32 అడుగుల ఏక‌శిలా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయించాన‌ని, అందులో ఆంజ‌నేయ స్వామి కూర్చుని ఉంటార‌ని, విగ్ర‌హం బ‌రువు 180 ట‌న్నులు ఉంటుంద‌ని, తాను 2006-2007లో మొద‌లుపెడితే ఆ గుడి నిర్మాణం పూర్త‌య్యే స‌రికి త‌న‌కు 17 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని, ప్ర‌పంచంలోనే పెద్ద ఏక‌శిలా విగ్ర‌హాల్లో అది ఒక‌టిగా ఆ విగ్ర‌హాన్ని చెప్తుంటార‌ని అర్జున్ పేర్కొన్నారు.

Tags:    

Similar News