పోలీస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇవ్వనున్న స్పిరిట్.. నిర్మాత కామెంట్స్ తో పెరిగిన అంచనాలు
తాను ఇప్పటికే స్పిరిట్ మూవీలోని కొన్ని సీన్స్ చూశానని, అవి ఫ్యాబులెస్ గా ఉన్నాయని చెప్పడం గమనార్హం.
సందీప్ రెడ్డి వంగా సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా డిస్కషన్స్ లోకి వచ్చేది ఆయన కథ చెప్పే తీరు. జానర్ ఏదైనా సరే, దానికి తనదైన ఇంటెన్సిటీ, ఎమోషనల్ లేయర్లు, క్యారెక్టర్ డ్రివెన్ నెరేటివ్ జోడించి కొత్త అనుభూతిగా మార్చడం ఆయన స్టైల్. ఇప్పుడదే డిస్కషన్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా చుట్టూ మొదలైంది. సినిమా నిర్మాత భూషణ్ కుమార్ చేసిన తాజా కామెంట్స్ ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
తాను ఇప్పటికే స్పిరిట్ మూవీలోని కొన్ని సీన్స్ చూశానని, అవి ఫ్యాబులెస్ గా ఉన్నాయని చెప్పడం గమనార్హం. అంతేకాదు, ఇదొక కాప్ స్టోరీ అయినప్పటికీ ఆడియన్స్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సాధారణంగా షూటింగ్ మధ్యలో నిర్మాతలు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా అరుదు. అందుకే ఈ కామెంట్స్‌ను కేవలం ప్రమోషనల్ బిల్డప్‌గా కాకుండా, సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్‌గా కూడా చూస్తున్నారు.
ఇక సందీప్ రెడ్డి వంగా కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన ప్రతి సినిమాలోనూ జానర్‌ను తనదైన విధంగా రీడిఫైన్ చేసినట్లు కనిపిస్తుంది. అర్జున్ రెడ్డిలో ప్రేమకథను రా ఎమోషన్స్‌తో చూపించారు. కబీర్ సింగ్ లో రీమేక్ అయినప్పటికీ కథన శైలిని మరింత కమర్షియల్‌గా విస్తరించారు. ఇక యానిమల్ లో ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, సైకాలజికల్ కాన్ఫ్లిక్ట్‌లను కలిపి ఒక కొత్త ఫార్మాట్‌ను సృష్టించారు. ఇప్పుడు స్పిరిట్ తో పోలీస్ డ్రామాను కూడా అదే స్థాయిలో రీఇన్వెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిర్మాత చెప్పిన దాని ప్రకారం, ఇది కేవలం యాక్షన్ సీక్వెన్సులు లేదా స్టైలిష్ మేకింగ్ గురించే కాకుండా, ఒక పోలీస్ క్యారెక్టర్‌ను పూర్తిగా భిన్నమైన మానసిక, ఎమోషనల్ యాంగిల్ లో చూపించే అవకాశం ఉందనే డిస్కషన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరోవైపు, షూటింగ్ దశలోనే వచ్చిన ఈ పాజిటివ్ ఇన్‌సైడ్ రియాక్షన్ స్పిరిట్ కు తొలి స్ట్రాంగ్ సిగ్నల్‌గా భావిస్తున్నారు. ప్రభాస్ స్టార్ ఇమేజ్, వంగా డైరెక్షన్, పాన్ ఇండియా స్కేల్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాల్ని పెంచాయి. ఇప్పుడు నిర్మాత స్థాయిలో వచ్చిన ఈ కాన్ఫిడెంట్ కామెంట్స్ ఆ అంచనాలను మరింత పెంచాయి. మరి స్పిరిట్ నిజంగా పోలీస్ డ్రామాకు కొత్త నిర్వచనం ఇస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.