RAPO23.. బడ్జెట్, యాక్షన్ లైనప్ మామూలుగా లేదుగా!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైరెక్టర్ గా మారుతున్న విషయం తెలిసిందే. RAPO23తో అతను చేస్తున్న ఈ డ్యూయల్ రోల్ మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

Update: 2026-08-04 12:45 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైరెక్టర్ గా మారుతున్న విషయం తెలిసిందే. RAPO23తో అతను చేస్తున్న ఈ డ్యూయల్ రోల్ మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇది ఏదో ప్రయోగాత్మకంగా తీస్తున్న చిన్న సినిమా అనుకుంటే పొరపాటే. ఈ ప్రాజెక్ట్ కు ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తన విజన్ మీద నిర్మాత కృష్ణ పోతినేని ఉంచిన నమ్మకంతో రామ్ ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ఫుల్ స్పీడ్ లో నడుస్తున్నాయి. మూవీ యూనిట్ అంతా పాండిచ్చేరిలో ల్యాండ్ అయింది. అక్కడ ఒక కీలకమైన 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. కథలో పాండిచ్చేరి సముద్ర తీర ప్రాంతాలకు, అక్కడి వాతావరణానికి చాలా ప్రాధాన్యత ఉందట. అందుకే టీమ్ అంతా అక్కడే ఉండి సినిమాలోని అతి ముఖ్యమైన సీన్స్ కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ పాండిచ్చేరి షెడ్యూల్ లో యాక్షన్ లవర్స్ కు కావాల్సిన సాలిడ్ స్టఫ్ రెడీ అవుతోంది. వంద కోట్ల బడ్జెట్ కాబట్టి ఫైట్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేశారు. కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలకు పనిచేసిన విక్రమ్ మోర్ మాస్టర్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆయన స్టైల్ కు తగ్గట్టుగానే RAPO23లో రొటీన్ ఫైట్స్ కాకుండా చాలా రియలిస్టిక్ గా సాగే రా యాక్షన్ బ్లాక్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ మాత్రమే కాకుండా సినిమాకు అవసరమైన కూల్ ఎలిమెంట్స్ కూడా ఇక్కడే కవర్ చేస్తున్నారు. ఒకవైపు ఫైట్స్ తీస్తూనే ఇంకోవైపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ షూట్ కూడా చేస్తున్నారు. పాండిచ్చేరి బీచ్ లొకేషన్స్ లో విజువల్ గా చాలా ప్లజెంట్ గా ఉండేలా ఒక మ్యూజికల్ ట్రాక్ ను ప్లాన్ చేశారు. సీనియర్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. ఆమె మార్క్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు.

ఒక పక్క హీరోగా నటిస్తూనే, మరో పక్క వంద కోట్ల ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. రామ్ కు ఇది నిజంగా ఒక పెద్ద టాస్క్. కానీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో అతను ఈ ప్రాజెక్ట్ ను చాలా కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేస్తున్నట్లు సెట్స్ నుంచి వస్తున్న ఇన్ఫో. యాక్షన్ కు తగ్గట్టుగానే ఎమోషన్స్, మ్యూజిక్ బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్కా కమర్షియల్ ప్యాకేజ్ ను రెడీ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే దర్శకుడిగా తన ఫస్ట్ అటెంప్ట్ తోనే రామ్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతోంది. అనవసరమైన హడావుడి లేకుండా సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఓవర్ హైప్ కు పోకుండా అనుకున్నది అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ బట్టి సినిమా కంటెంట్ పై ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News