హాలీవుడ్ వెర్షన్ లోనూ మక్కల్ సెల్వన్!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కిన సంచలన చిత్రం `మహారాజా` హాలీవుడ్ రీమేక్ ఇప్పటికే అధికారికంగా ఖరారై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కిన సంచలన చిత్రం `మహారాజా` హాలీవుడ్ రీమేక్ ఇప్పటికే అధికారికంగా ఖరారై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో హాలీవుడ్ వెర్షన్ రీమేక్‌లో కూడా తనకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తానని విజయ్ సేతుపతి ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం లభిస్తే తాను ఎంతో సంతోషంగా స్వీకరిస్తానని తెలిపారు.
విజయ్ సేతుపతి 50వ చిత్రంగా నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన `మహారాజా` ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, గుండెలను పిండేసే ఎమోషన్స్‌తో రూపుదిద్దుకున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడమే కాకుండా ఓటీటీ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చైనా వంటి విదేశాల్లోనూ బ్రహ్మరథం పట్టిన ఈ కథకున్న యూనివర్సల్ అప్పీల్ కారణంగానే హాలీవుడ్ రీమేక్ ఖరారైంది.
హాలీవుడ్ రీమేక్‌పై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. హాలీవుడ్ వెర్షన్‌లో నటించే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పారు. భారతీయ వెర్షన్‌లో తానే స్వయంగా నటించి మెప్పించినప్పటికీ హాలీవుడ్ సాంకేతికత ,నటులతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఆ పాత్రను మళ్లీ రీ-క్రియేట్ చేసే ఛాన్స్ వస్తే ఆఫర్‌ను ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. మక్కల్ సెల్వన్ హాలీవుడ్ రీమేక్‌లోనూ కనిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇక ఈ హాలీవుడ్ రీమేక్‌లో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయంపై విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ఆస్కార్ విజేత `ఇంటర్‌స్టెల్లార్` ఫేమ్ మాథ్యూ మెక్కానహీ పేరును సూచించారు. ఆయనలోని ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్ తండ్రి పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా లేదా? ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా అది తన కెరీర్‌లో గుర్తుండిపోయే క్షణం అవుతుందని కొనియాడారు.
హాలీవుడ్ రీమేక్ వార్తలతో పాటు `మహారాజా 2` ప్రాజెక్ట్‌ను కూడా విజయ్ సేతుపతి ధృవీకరించడం విశేషం. మొదటి భాగానికి వచ్చిన ఊహించని ఆదరణను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ సీక్వెల్ కథను మరింత ఆసక్తికరంగా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హాలీవుడ్ రీమేక్, అటు సీక్వెల్‌తో `మహారాజా` గ్లోబల్ బ్రాండ్‌గా మారుతోంది.
తమ అభిమాన నటుడు మక్కల్ సెల్వన్ నటించిన సినిమా హాలీవుడ్ దాకా వెళ్లడమే కాకుండా స్వయంగా ఆయనే హాలీవుడ్ వెర్షన్‌లో నటించడానికి సుముఖత చూపడం భారతీయ సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప గౌరవం. విలక్షణ నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న విజయ్ సేతుపతి హాలీవుడ్‌లోకి అడుగుపెడితే అది భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.